టెక్‌ వ్యూ: ముగింపు అనిశ్చితం

ABN , First Publish Date - 2020-03-12T06:43:14+05:30 IST

నిఫ్టీ నెగిటివ్‌గా ప్రారంభమైనా దిగువ స్థాయిలో కొనుగోళ్ల మద్దతుతో కీలక స్థాయి 10300 వద్ద రికవరీ సాధించింది. కాని అమ్మకాల ఒత్తిడి వల్ల...

టెక్‌ వ్యూ: ముగింపు అనిశ్చితం

నిఫ్టీ నెగిటివ్‌గా ప్రారంభమైనా దిగువ స్థాయిలో కొనుగోళ్ల మద్దతుతో కీలక స్థాయి 10300 వద్ద రికవరీ సాధించింది. కాని అమ్మకాల ఒత్తిడి వల్ల ఆ గరిష్ఠ స్థాయిల్లో నిలదొక్కుకోలేకపోయింది. చివరికి డే గరిష్ఠ, కనిష్ఠ స్థాయిలకు మధ్యన క్లోజ్‌ కావడం అనిశ్చితిని సూచిస్తోంది. టెక్నికల్‌గా ప్రధాన ట్రెండ్‌ బలహీనంగానే ఉంది. కాని గత మూడు వారాలుగా నిరంతర డౌన్‌ట్రెండ్‌లో ఉన్నందు వల్ల ఓవర్‌సోల్డ్‌ స్థితి కొనసాగుతోంది. ఈ కారణంగా బలమైన పునరుజ్జీవానికి కూడా ఆస్కారం ఉంది. మార్కెట్‌ స్వల్పకాలిక మద్దతు స్థాయిల్లో మూడో సారి పరీక్ష ఎదుర్కొంటోంది. ఈ సారి బలమైన కదలిక ఏర్పడవచ్చు.

 

గురువారం స్థాయిలివే...

  • నిరోధం : 10500
  • మద్దతు : 10390

మరింత అప్‌ట్రెండ్‌ కోసం మైనర్‌ నిరోధ స్థాయి 10500 కన్నా పైన నిలదొక్కుకోవాలి. ప్రధాన నిరో ధం 10540. ఆ పైన మాత్రమే పాజిటివ్‌ ట్రెండ్‌ కొనసాగుతుంది. మరో ప్రధాన నిరోధం 10600.

మైనర్‌ మద్దతు స్థాయి 10390 కన్నా దిగజారితే మరింత బలహీనపడుతుంది. ప్రధాన మద్దతు స్థాయి 10300.  

- వి.సుందర్‌ రాజా

Updated Date - 2020-03-12T06:43:14+05:30 IST