టెక్‌ వ్యూ: ప్రధాన మద్దతు 11000

ABN , First Publish Date - 2020-03-02T07:41:00+05:30 IST

నిఫ్టీ గత సోమవారంనాడు ప్రధాన మద్దతు స్థాయి 12000 కన్నా దిగజారి వారం అంతా డౌన్‌ట్రెండ్‌ కొనసాగించింది. చివరికి 500 పాయింట్లకు పైగా నష్టపోయి వారం కనిష్ఠ స్థాయి 11200 సమీపంలో క్లోజ్‌ కావడం..

టెక్‌ వ్యూ: ప్రధాన మద్దతు 11000

నిఫ్టీ గత సోమవారంనాడు ప్రధాన మద్దతు స్థాయి 12000 కన్నా దిగజారి వారం అంతా డౌన్‌ట్రెండ్‌ కొనసాగించింది. చివరికి 500 పాయింట్లకు పైగా నష్టపోయి వారం కనిష్ఠ స్థాయి 11200 సమీపంలో క్లోజ్‌ కావడం అమ్మకాల ఒత్తిడిని సూచిస్తోంది. ప్రస్తుతం స్వల్పకాలిక కరెక్షన్‌లో ఉన్న నిఫ్టీ మధ్యకాలిక మద్దతు స్థాయి 11000. ఈ స్థాయిలో రికవరీకి ఆస్కారం ఉంది. తాజాగా ఏర్పడిన బలమైన బేరిష్‌ ట్రెండ్‌లో 200 డిఎంఏ కన్నా కూడా దిగజారడం బలహీనత సంకేతం. అలాగే స్వల్పకాలిక ఓవర్‌బాట్‌ స్థితి ఏర్పడడం వల్ల స్వల్పకాలిక రికవరీ లేదా కన్సాలిడేషన్‌ ఉం డవచ్చు. స్వల్పకాలిక బై పొజిషన్లు తీసుకోవాలంటే మాత్రం మొదట కొద్ది రోజులు కన్సాలిడేట్‌ అయి ఆ తర్వాత నిలదొక్కుకోవాలి. మొత్తం మీద కొద్ది  రోజుల పాటు ఆటుపోట్ల ట్రెండ్‌కు ఆస్కారం ఉంది.


బుల్లిష్‌ స్థాయిలు : రికవరీ బాట పడితే నిరోధ స్థాయి 11350 కన్నా పైన నిలదొక్కుకోవాలి. ప్రధాన నిరోధం 11500. ఐదు నెలల క్రితం అక్టోబరు 24, 25 తేదీల్లో టాప్‌ ఇది. 

బేరిష్‌ స్థాయిలు : తక్షణ అప్‌ట్రెండ్‌ ఆశలు నిలబెట్టుకోవాలంటే ప్రధాన మద్దతు స్థాయి 11000 వద్ద తప్పనిసరిగా రికవరీ సాధించాలి. అంతకన్నా దిగజారితే స్వల్పకాలిక బలహీనత తప్పదు. 

బ్యాంక్‌ నిఫ్టీ : ఈ సూచీకి తదుపరి నిరోధ స్థాయి 29500. మరింత రికవరీ బాట పట్టాలంటే ఈ స్థాయి కన్నా పైన నిలదొక్కుకోవాలి.

స్వల్పకాలిక వ్యూహం : 11000 వద్ద నిలదొక్కుకున్నప్పుడే స్వల్పకాలిక ట్రేడర్లు స్వల్పకాలిక బై పొజిషన్లు పరిశీలించవచ్చు. మార్కెట్‌ అప్‌ట్రెండ్‌లో ప్రవేశించేందుకు కొంత వ్యవధి పడుతుంది కాబట్టి అప్రమత్తత అవశ్యం. 

పాటర్న్‌ : నిఫ్టీ 11000 వద్ద ‘‘అడ్డంగా కనిపిస్తున్న సపోర్ట్‌ ట్రెండ్‌లైన్‌’’కు చేరువవుతోంది. ఇక్కడ బలంగా కన్సాలిడేట్‌ అయినప్పుడే ట్రెండ్‌లో సానుకూలతకు ఆస్కారం ఉంటుంది. 11050 వద్ద ‘‘అడ్డంగా కనిపిస్తున్న రెసిస్టెన్స్‌ ట్రెండ్‌లైన్‌’’ వద్ద నిరోధం ఉంది. అలాగే ఇండెక్స్‌ 20, 50 డిఎంఏల కన్నా చాలా దిగువన ఉన్నందు వల్ల తక్షణ బుల్లిష్‌ ట్రెండ్‌ అవకాశాలు లేవు. 

టైమ్‌ : ఈ సూచీ ప్రకారం మంగళవారం తదుపరి రివర్సల్‌ ఉంది. వీక్లీ చార్టుల్లో కూడా ఈ వారంలో రివర్సల్‌ కనిపిస్తోంది. మైనర్‌ బాటమ్‌ లేదా మైనర్‌ రికవరీ ఏర్పడవచ్చు.


సోమవారం స్థాయిలు

నిరోధం: 11280,11350

మద్దతు : 11200, 11160

                                                                      - వి. సుందర్‌ రాజా

Updated Date - 2020-03-02T07:41:00+05:30 IST