నిరోధం 8000

ABN , First Publish Date - 2020-03-25T06:43:32+05:30 IST

నిఫ్టీ 300 పాయింట్లకు పైన ప్రారంభమై మానసిక అవధి 800 వరకు వెళ్లి నిలదొక్కుకోలేకపోయింది. ఆ స్థాయిలో ఇంట్రాడే కరెక్షన్‌లో పడి 7500 వరకు దిగజారి రికవరీ సాధించింది. ఈ రికవరీతో తక్షణ డౌన్‌ట్రెండ్‌ను నివారించుకుంది. కాని డే కనిష్ఠ, గరిష్ఠ స్థాయిలకు నడుమన ముగియడం...

నిరోధం 8000

నిఫ్టీ 300 పాయింట్లకు పైన ప్రారంభమై మానసిక అవధి 800 వరకు వెళ్లి నిలదొక్కుకోలేకపోయింది. ఆ స్థాయిలో ఇంట్రాడే కరెక్షన్‌లో పడి 7500 వరకు దిగజారి రికవరీ సాధించింది. ఈ రికవరీతో తక్షణ డౌన్‌ట్రెండ్‌ను నివారించుకుంది. కాని డే కనిష్ఠ, గరిష్ఠ స్థాయిలకు నడుమన ముగియడం ట్రెండ్‌లో అనిశ్చితి సంకేతం. అయితే 7500 మద్దతు స్థాయిగా తీసుకున్నట్టు కనిపిస్తోంది. మరో రోజు దీన్ని ధ్రువీకరించాల్సి ఉంది. రిలీఫ్‌ ర్యాలీ ఏర్పడుతుందా, లేదా అనేందుకు బుధవారం నాటి కదలికలు కీలకం. ప్రస్తుతానికి మార్కెట్‌ 8000-7500 పరిధి ఏర్పరచుకుంది. 


బుధవారం స్థాయిలివే..

నిరోధం : 7920 మద్దతు : 7770


మైనర్‌ ఇంట్రాడే నిరోధం 7920 కన్నా పైన ట్రేడయితే మరింత అప్‌ట్రెండ్‌లో పురోగమిస్తుంది. ప్రధాన నిరోధం 8000. మరోసారి ఈ స్వల్పకాలిక నిరోధం వద్ద పరీక్ష ఎదుర్కొనవచ్చు. ఆ పైన మాత్రమే రిలీఫ్‌ ర్యాలీకి ఆస్కారం ఉంది. 


8000 వద్ద విఫలమైతే మరింత బలహీనపడవచ్చు. ప్రధాన మద్దతు స్థాయి 7700. అంతకన్నా దిగజారితే కరెక్షన్‌ మరింతగా ఉంటుంది. 


వి.సుందర్‌ రాజా

Read more