నిరోధం 11350

ABN , First Publish Date - 2020-03-04T06:42:04+05:30 IST

నిఫ్టీ ప్రారంభంలోనే బలమైన ర్యాలీ సాధించి రోజంతా అప్‌ట్రెండ్‌ను కొనసాగించింది. ప్రధాన నిరోధం 11350 వరకు వెళ్లిన తర్వాత మైనర్‌ కరెక్షన్‌ సాధించినా చివరికి 170 పాయిం...

నిరోధం 11350

నిఫ్టీ ప్రారంభంలోనే బలమైన ర్యాలీ సాధించి రోజంతా అప్‌ట్రెండ్‌ను కొనసాగించింది. ప్రధాన నిరోధం 11350 వరకు వెళ్లిన తర్వాత మైనర్‌ కరెక్షన్‌ సాధించినా చివరికి 170 పాయింట్ల లాభంతో బలంగానే క్లోజయింది. ఈ బలమైన రికవరీతో కనిష్ఠ స్థాయిని తాకే దశ ముగిసిందని భావించవచ్చు. తక్షణ డౌన్‌ట్రెండ్‌ ముప్పు నుంచి కూడా బయటపడింది. కాని ఇంకా బలమైన అప్‌ట్రెండ్‌లో ప్రవేశించాల్సి ఉంది. ఇందుకు మరింత బలాన్ని పుంజుకోవడం అవసరం. 


బుధవారం స్థాయిలివే...

నిరోధం : 11350 మద్దతు : 11280


మరింత రికవరీలో పడితే మైనర్‌ ఇంట్రాడే నిరోధం 11350 వద్ద పరీక్ష ఎదుర్కొనవచ్చు. ఆ పైన ముగిసినప్పుడే మరింత అప్‌ట్రెండ్‌కు ఆస్కారం ఉంటుంది. మరో ప్రధాన నిరోధం 11500. 


11350 వద్ద విఫలమైతే మరింత బలహీనతలో ప్రవేశించే మప్పు తప్పదు. మైనర్‌ మద్దతు స్థాయి 11280 కన్నా దిగజారితే మైనర్‌ బలహీనతగా భావించాలి. ప్రధాన మద్దతు స్థాయి 11200.


వి.సుందర్‌ రాజా

Updated Date - 2020-03-04T06:42:04+05:30 IST