టెక్ వ్యూ: కన్సాలిడేషన్ తప్పనిసరి
ABN , First Publish Date - 2020-03-16T06:23:14+05:30 IST
నిఫ్టీ గత వారం బేరి్‌షగా ప్రారంభమై ప్రధాన మద్దతు స్థాయి 10800 కన్నా దిగజారింది. ఈ మద్దతు స్థాయిని పోగొట్టుకోవడం ద్వారా తక్షణ అప్‌ట్రెండ్ ఆశలు అంతరించిపోవడంతో పాటు మరింత...
నిఫ్టీ గత వారం బేరి్‌షగా ప్రారంభమై ప్రధాన మద్దతు స్థాయి 10800 కన్నా దిగజారింది. ఈ మద్దతు స్థాయిని పోగొట్టుకోవడం ద్వారా తక్షణ అప్‌ట్రెండ్ ఆశలు అంతరించిపోవడంతో పాటు మరింత డౌన్‌ట్రెండ్‌కు ఆస్కారం ఏర్పడింది. ఆ తర్వాత వారం అంతా డౌన్‌ట్రెండ్‌ను కొనసాగిస్తూ శుక్రవారంనాడు మరింత దిగజారి 8600 వరకు కూడా క్షీణించింది. కాని అంతలోనే కోలుకుని చివరికి 365 పాయింట్ల లాభంతో ముగిసినా ఇది మైనర్ బౌన్స్‌బ్యాక్ మాత్రమే. వారం మొత్తం మీద నిఫ్టీ 1000 పాయింట్లకు పైగా నష్టపోయి వారం గరిష్ఠ, కనిష్ఠ స్థాయిలకు మధ్యస్థంగా ముగిసింది.
ట్రెండ్‌లో అనిశ్చితికి ఇది దర్పణం. టెక్నికల్‌గా ప్రధాన ట్రెండ్ దిగువకే ఉంది. ఓవర్‌సోల్డ్ స్థితిలో ఉన్నందు వల్ల మైనర్ రికవరీ లేదా కన్సాలిడేషన్‌కు ఆస్కారం ఉంది. 10000 వద్ద ఏర్పడిన అతి పెద్ద బ్రేక్‌డౌన్ కారణంగా ఈ మానసిక అవధి వరకు పుల్‌బ్యాక్ రికవరీ కూడా ఉండవచ్చు. గత కొన్ని రోజులుగా అన్ని మద్దతు స్థాయిలను కోల్పోతూ బేరిష్ ట్రెండ్‌లో కూడా ప్రవేశించింది. ఇంకా సరైన కన్సాలిడేషన్ ఏర్పడని కారణంగా స్వల్పకాలంలో మరింత ఆటుపోట్ల ధోరణికే ఆస్కారం ఉంది.
బుల్లిష్ స్థాయిలు: టెక్నికల్‌గా పూర్తి స్థాయి కన్సాలిడేషన్ అనంతరమే సరైన దిశ తెలుస్తుంది. మరిం త పాజిటివ్ ధోరణి ఏర్పడితే గత శుక్రవారం ఏర్పడిన మేజర్ హై 10150 కన్నా పైన నిలదొక్కుకోవాలి. ప్రధాన నిరోధ స్థాయిలు 10350, 10550.
బేరిష్ స్థాయిలు : 10000 వద్ద విఫలమైతే మరింత డౌన్‌ట్రెండ్ ఏర్పడుతుంది. మైనర్ మద్దతు స్థాయి 9900 కన్నా దిగజారితే మరింత బలహీనపడుతుంది. మరో ప్రధాన మద్దతు స్థాయి 9700. అంతకన్నా దిగజారితే స్వల్పకాలిక బలహీనత మరింతగా కొనసాగుతుంది.
బ్యాంక్ నిఫ్టీ : ఈ సూచీకి గత వారం ఏర్పడిన టాప్ 25700. ఆ పైన నిలదొక్కుకుంటే మరింత అప్‌ట్రెండ్ ఉంటుంది. ప్రధాన నిరోధం 26000.
పాటర్న్ : మార్కెట్ ప్రస్తుతం స్వల్పకాలిక 20, 50 ఎటిపిల కన్నా దిగువకు వచ్చింది. తక్షణ బుల్లిష్ ట్రెండ్ అవకాశాలు లేవనేందుకు ఇది సంకేతం. అలాగే ‘‘ఏటవాలుగా దిగువకు కనిపిస్తున్నర రెసిస్టెన్స్ ట్రెండ్‌లైన్’’ కన్నా చాలా దిగువన ఉంది. అప్‌ట్రెండ్‌కు మరింత సమయం పట్టవచ్చు. స్వల్పకాలిక అప్‌ట్రెండ్ కోసం 10150 వద్ద ‘‘అడ్డంగా కనిపిస్తున్న రెసిస్టెన్స్ ట్రెండ్‌లైన్’’ వద్ద బ్రేకౌట్ సాధించాలి.
టైమ్ : ఈ సూచీ ప్రకారం మంగళవారం తదుపరి రివర్సల్ ఉంది.
సోమవారం స్థాయిలు
నిరోధం: 10080,10150
మద్దతు : 9960, 9900
- - వి. సుందర్ రాజా
- www.sundartrends.in