ఊపిరి పీల్చుకున్న టాటా మోటార్స్.. ఆగస్టులో పెరిగిన విక్రయాలు
ABN , First Publish Date - 2020-09-03T23:19:31+05:30 IST
కరోనా మహమ్మారి కారణంగా కుదేలైన వాహన విక్రయాలు మళ్లీ క్రమంగా పుంజుకుంటున్నాయి. గత నెలలో టాటా మోటార్స్ విక్రయాలు 13.38 శాతం పెరిగి

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి కారణంగా కుదేలైన వాహన విక్రయాలు మళ్లీ క్రమంగా పుంజుకుంటున్నాయి. గత నెలలో టాటా మోటార్స్ విక్రయాలు 13.38 శాతం పెరిగి 36,472 యూనిట్లు అమ్ముడుపోయాయి. గతేడాది ఇదే నెలలో టాటా మోటార్స్ 32,166 యూనిట్లను విక్రయించినట్టు టాటా మోటార్స్ వెల్లడించింది. ఇక, మొత్తం దేశీయ విక్రయాలు 21.6 శాతం పెరిగి 35,420 యూనిట్లు అమ్ముడుపోయాయి.
గతేడాది ఆగస్టులో 29,140 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. గత నెలలో ప్రయాణికుల వాహన విక్రయాలు మాత్రం రెండింతలై 18,583 యూనిట్లుకు చేరుకున్నాయి. గతేడాది ఇదే నెలలో 7,316 యూనిట్లు మాత్రమే అమ్మువడం గమనార్హం. అయితే, మొత్తం వాణిజ్య వాహన విక్రయాల్లో మాత్రం 28 శాతం క్షీణత నమోదైంది. గతేడాది మొత్తం 24,850 వాణిజ్య వాహనాలు అమ్ముడుపోగా, ఈసారి 17,889 విక్రయాలు మాత్రమే అమ్ముడయ్యాయి.