ఇంటి ముంగిటకు రేషన్ సరఫరాకు టాటా ఏస్ గోల్డ్ మినీ ట్రక్కులు

ABN , First Publish Date - 2020-10-24T16:15:58+05:30 IST

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటి ముంగిటకు రేషన్ సరఫరాకు 6,413 టాటా ఏస్ గోల్డ్ మినీట్రక్కుల కొనుగోలుకు...

ఇంటి ముంగిటకు రేషన్ సరఫరాకు టాటా ఏస్ గోల్డ్ మినీ ట్రక్కులు

6,413 వాహనాల కొనుగోలుకు ఏపీ పౌరసరఫరాల శాఖ ఆర్డర్

ముంబై : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటి ముంగిటకు రేషన్ సరఫరాకు 6,413 టాటా ఏస్ గోల్డ్ మినీట్రక్కుల కొనుగోలుకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఆర్డరు ఇచ్చింది. ఏపీ పౌరసరఫరాల సంస్థ ఆర్డరులో టాప్ బిడ్డరుగా టాటామోటార్స్ నిలిచింది. బీఎస్6  ప్రమాణాల ప్రకారం టాటా ఏస్ గోల్డ్ మినీట్రక్కులను పంపిణీ చేస్తామని టాటా మోటార్స్ వైస్ ప్రెసిడెంట్ వినయ్ పాథక్ చెప్పారు. 15 ఏళ్ల నుంచి విక్రయిస్తున్న టాటా ఏస్ గోల్డ్ మినీ ట్రక్కులు పెట్రోలు, డీజిల్, సీఎన్జీతో పనిచేసే ఇంజన్లను అందిస్తోంది. టాటా ఏస్ వాహనాలను విక్రయించిన తర్వాత వాహన నిర్వహణకు కార్పొరేషనుకు సహాయం చేస్తామని టాటామోటార్స్ ప్రకటించింది. 

Updated Date - 2020-10-24T16:15:58+05:30 IST