డిసిఫర్‌తో సైయంట్‌ ఎంఓయూ...

ABN , First Publish Date - 2020-12-16T01:51:07+05:30 IST

పెర్త్‌ కేంద్రంగా ఉన్న డిసిఫర్‌తో అంతర్జాతీయ ఇంజినీరింగ్‌, తయారీ, సాంకేతిక పరిష్కారాల కంపెనీ సైయెంట్‌ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. టైలింగ్‌ స్టోరేజీ సదుపాయాల కోసం క్లౌడ్‌ పర్యవేక్షణ మరియు పరిపాలన వేదికను డిసిఫర్‌ అందిస్తుంది.

డిసిఫర్‌తో సైయంట్‌ ఎంఓయూ...

పెర్త్ : పెర్త్‌ కేంద్రంగా ఉన్న డిసిఫర్‌తో అంతర్జాతీయ ఇంజినీరింగ్‌, తయారీ, సాంకేతిక పరిష్కారాల కంపెనీ  సైయెంట్‌ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. టైలింగ్‌ స్టోరేజీ సదుపాయాల కోసం క్లౌడ్‌ పర్యవేక్షణ మరియు పరిపాలన వేదికను డిసిఫర్‌ అందిస్తుంది. ఈ ఎంఓయూలో భాగంగా సైయెంట్‌ ఇప్పుడు డిసిఫర్‌కు తమ క్లౌడ్‌ మైనింగ్‌ ప్లాట్‌ఫామ్‌తో టైలింగ్స్‌ మరియు పునరావాస పర్యవేక్షణతో మద్దతునందించనుంది. మరిన్ని వివరాలిలా ఉన్నాయి.

టైలింగ్స్‌ అంటే మినరల్‌ వ్యర్ధాలు. ముడి ఖనిజ ప్రాసెసింగ్‌ తర్వాత మినరల్‌ సాంద్రతలను ఒడిసిపట్టే క్రమంలో ఇవి ఉద్భవిస్తాయి. వీటిని ఇంజినీర్డ్‌ కంటెయిన్‌మెంట్‌ నిర్మాణంలో భద్రపరుస్తారు. దీనినే ‘టైలింగ్‌ స్టోరేజీ సదుపాయం(టీఎస్‌ఎఫ్‌)’ అంటారు. అంతర్జాతీయంగా 3,500 యాక్టివ్‌ టీఎస్‌ఎఫ్‌ లు ఉన్నాయని అంచనా. ఇవి దాదాపు ఒక మిలియన్‌ హెక్టార్ల భూమిని ఆక్రమించాయి. వీటిలో చాలా వరకూ పనికిరానటువంటివి లేదా వదిలివేయడం కూడా జరిగింది.

టైలింగ్‌ స్టోరేజీ సదుపాయాలు విఫలం కావడం వల్ల అనియంత్రితంగా నీరు, వ్యర్థపదార్ధాలు లేదా పర్యావరణానికి హాని కలిగించే విషపదార్థాలూ విడుదలయ్యే అవకాశాలుంటాయి. క్లౌడ్‌ మైనింగ్‌ ప్లాట్‌ఫామ్‌తో, మైనింగ్‌ కంపెనీలు ఇప్పుడు మాన్యువల్‌ ప్రక్రియలను భర్తీ చేయడంతో పాటుగా అపరిపక్వ సమాచారాన్ని మరింత స్పష్టమైన, సురక్షిత క్లౌడ్‌ వేదిక ద్వారా భర్తీ చేయవచ్చు. ఇది అత్యాధునిక పరిశ్రమ ప్రక్రియలకు కట్టుబడి ఉండటంతో పాటుగా నిర్ధారిత ప్రమాణాలనూ అనుసరిస్తాయి. సైయెంట్‌, దాని అనుబంధ సంస్థలు, ఐజీ భాగస్వాములు విక్రయాలు , అమలులో ప్రతిష్టాత్మక పాత్రను పోషించడంతో పాటుగా ముందుకు వెళ్లే కొద్దీ ఈ పరిష్కారాలకు మద్దతునందిస్తుంది.

Updated Date - 2020-12-16T01:51:07+05:30 IST