వరుస లాభాల్లో స్టాక్ మార్కెట్

ABN , First Publish Date - 2020-10-21T18:29:39+05:30 IST

స్టాక్ మార్కెట్ భారీ లాభాలతో పరిగెడుతోంది. ఇవాళ ఆరంభంలోనే సెన్సెక్స్ 402 పాయింట్లు లాభపడింది. నిఫ్టీ 107 పాయింట్లు లాభాలు పొందింది.

వరుస లాభాల్లో స్టాక్ మార్కెట్

ముంబై: స్టాక్ మార్కెట్ భారీ లాభాలతో పరిగెడుతోంది. ఇవాళ ఆరంభంలోనే సెన్సెక్స్ 402 పాయింట్లు లాభపడింది. నిఫ్టీ 107 పాయింట్లు లాభాలు పొందింది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల రాకతో స్టాక్ మార్కెట్ ఫుల్ జోష్‌లో ఉంది. బజాజ్ ఫిన్ సర్వీసెస్, ఆల్ట్రా టెక్ సిమెంట్ వంటి 31 కంపెనీలు తమ ఫలితాలను ప్రకటించనున్నాయి. కరోనా వ్యాక్సినేషన్‌పై ప్రధాని ప్రకటన కూడా లాభాలకు ఊతమిచ్చిందని విశ్లేషకులు అంటున్నారు. 

ఇదిలా ఉంటే ... స్టాక్ మార్కెట్లు గత మూడు రోజులుగా లాభాలతో సాగుతున్నాయి. మంగళవారం కూడా లాభాలతో ప్రారంభమై లాభాలతోనే ముగిశాయి. నిన్న 112 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్ 40,544 వద్ద ముగిసింది. నిఫ్టీ 23 పాయింట్లు లాభంతో 11,896 దగ్గర నిలిచింది. డాలరు రూపాయి మారకం విలువ 73.46గా ఉంది. 

Updated Date - 2020-10-21T18:29:39+05:30 IST