స్టాక్ మార్కెట్ల చరిత్రలోనే మరో అతిపెద్ద పతనం

ABN , First Publish Date - 2020-03-13T15:57:20+05:30 IST

స్టాక్ మార్కెట్ల చరిత్రలోనే మరో అతిపెద్ద పతనం

స్టాక్ మార్కెట్ల చరిత్రలోనే మరో అతిపెద్ద పతనం

ముంబై: స్టాక్ మార్కెట్లలో కరోనా బ్లెడ్ బాత్ కొనసాగుతోంది. మరోసారి మార్కెట్ల చరిత్రలోనే ఈరోజు అతిపెద్ద పతనం చోటు చేసుకుంది. నిన్న ఒక్కరోజే లక్షలకోట్ల సంపదను ఆవిరి చేసిన ఈ మహమ్మారి ఈరోజు కూడా తన ప్రతాపాన్ని చూపిస్తోంది. సూచీలను తొక్కిపడేస్తోంది. శుక్రవారం ఉదయం దేశీయ మార్కెట్లు భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. నిఫ్టీ 966 పాయింట్లు కోల్పోయి లోయర్ సర్క్యూట్‌ను తాకడంతో 45 నిమిషాల పాటు ట్రేడింగ్‌ను నిలిపివేశారు. సెన్సెక్స్ సైతం 3000 పాయింట్లకు పైగా నష్టపోవడంతో అక్కడా ట్రేడింగ్ నిలిచిపోయింది. 


డబ్ల్యూహెచ్‌వో కరోనాను ప్రపంచ మహమ్మారిగా ప్రకటించడంతో ఆర్థిక మాంధ్యం తప్పదన్న విశ్వేషణలు సూచీలను నేలకు దించాయి. వైరస్ ధాటికి అటు ఆసియా మార్కెట్లు భారీ పతనాన్ని చవిచూస్తున్నాయి. సురక్షితంగా భావించే బంగారం, బాండ్ల షేర్లు నేల చూపులు చూస్తున్నాయి. ఆస్ట్రేలియా మార్కెట్లు దాదాపు ఏడు శాతం మేర కుంగాయి. న్యూజిల్యాండ్ సూచీలు చరిత్రలోనే అత్యధిక ఇండ్రోడీ నష్టాలను నమోదు చేశాయి. జపాన్‌కు చెందిన నిక్కీ పది శాతం, కొరియా కోస్టాగ్ 8 శాతం పడిపోవడంతో 20 నిమిషాల పాటు ట్రేడింగ్‌ను నిలిపివేశారు. అమెరికా మార్కెట్లు భారీ స్థాయిలో పతనం కావడం ఆసియా మార్కెట్లపై భారీ ప్రభావం చూపాయి. 


అమెరికా డోజోన్స్ ఓ దశలో పది శాతం మేర నష్టపోయింది. 1987నాటి బ్లాక్ మండే క్రాష్ తర్వాత ఈ స్థాయిలో పతనం కావడం ఇదే తొలిసారి. అమెరికా మార్కెట్లోకి 1.5 ట్రిలియన్ డాలర్లు చొప్పించనున్నామని అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించడంతో కాస్త కోలుకున్న మార్కెట్లు యూరప్ ప్రయాణాలపై ఆంక్షలు విధించడంతో భారీగా పతనం అయ్యాయి. ఎస్‌ఎన్‌పీ 5009.5శాతం పడిపోవడంతో కాసేపు ట్రేడింగ్‌ను నిలిపివేశారు. 

Updated Date - 2020-03-13T15:57:20+05:30 IST