స్వల్ప లాభాలతో ముగిసిన మార్కెట్‌

ABN , First Publish Date - 2020-03-12T06:51:35+05:30 IST

గత సోమవారం రక్తపాతం చవి చూసిన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ బుధవారం కొద్ది పాటి లాభాలతో ముగిసింది. సెన్సెక్స్‌ 62.45 పాయింట్ల లాభంతో 35,697.40 వద్ద, నిఫ్టీ 6.95 పాయింట్ల స్వల్ప లాభంతో...

స్వల్ప లాభాలతో ముగిసిన మార్కెట్‌

ముంబై: గత సోమవారం రక్తపాతం చవి చూసిన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ బుధవారం కొద్ది పాటి లాభాలతో ముగిసింది. సెన్సెక్స్‌ 62.45 పాయింట్ల లాభంతో 35,697.40 వద్ద, నిఫ్టీ 6.95 పాయింట్ల స్వల్ప లాభంతో 10,458.40 పాయింట్ల వద్ద క్లోజయ్యాయి. సెన్సెక్స్‌లోని 30 కంపెనీల షేర్ల లో 12 మాత్రమే లాభాలతో క్లోజయ్యాయి. ఇంట్రా డేలో సెన్సెక్స్‌ ఒక దశలో 386 పాయింట్లు దూసుకు పోయింది. ఆ వెంటనే ఇన్వెస్టర్లు అమ్మకాలకు దిగడంతో, చివరికి 62.45 పాయింట్ల స్వల్ప లాభాలతో సరిపెట్టుకుంది. సోమవారం 12 శాతం పతనమైన సెన్సెక్స్‌ దిగ్గజం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేర్లు 3.6 శాతం పెరగడం సెన్సెక్స్‌కు కలిసొచ్చింది. లేకపోతే బుధవారమూ మార్కెట్‌  నష్టాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చేదని మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి. 


యెస్‌ బ్యాంక్‌ షేర్లు మరింత పైకి..

యెస్‌ బ్యాంక్‌ షేర్లలో ర్యాలీ బుధవారమూ కొనసాగింది. బీఎ్‌సఈలో ఈ షేర్లు మరో 35.53 శాతం లాభంతో రూ.28.80 వద్ద ముగిశాయి. గత రెండు సెషన్స్‌లోనే ఈ బ్యాంకుల షేర్లు దాదాపు 66 శాతం పెరిగాయి.


రూ.100 దిగువన టాటా మోటార్స్‌

టాటా మోటార్స్‌ షేరు బుధవారం మరింత క్షీణించాయి. బీఎ్‌సఈలో ఈ కంపెనీ షేరు 6.43 శాతం నష్టపోయి రూ.99 వద్ద క్లోజైంది. 2009 సెప్టెంబరు తర్వాత టాటా మోటార్స్‌ కంపెనీ షేరు రూ.100 దిగువన ముగియడం ఇదే మొదటిసారి.


‘ఈక్విటీ’ పథకాల్లోకి రూ.10,730 కోట్లు

స్టాక్‌ మార్కెట్‌ ఆటుపోట్లు ఎదుర్కొంటున్నా మదుపరులు ఎం ఎఫ్‌ల ఈక్విటీ పథకాల్లో పెద్ద ఎత్తున మదుపు చేస్తున్నారు. ఫిబ్రవరిలో ఈ పథకాల్లోకి రూ.10,730 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. గత 11 నెలల్లో ఇదే అతిపెద్ద మొత్తం. ఈ సంవత్సరం జనవరి నెలల్లో ఈక్విటీ, ఈఎల్‌ఎస్‌ఎస్‌ పథకాల్లో రూ.7,547 కోట్లున్న నికర పెట్టుబడులు ఫిబ్రవరి, 2020లో రూ.10,730 కోట్లకు చేరాయి.

Updated Date - 2020-03-12T06:51:35+05:30 IST