స్పైస్‌జెట్ నుంచి ‘స్పైస్‌క్లబ్’
ABN , First Publish Date - 2020-08-20T06:24:09+05:30 IST
తరచుగా విమానయానం చేసే కస్టమర్ల కోసం ‘స్పైస్ క్లబ్’ పేరిట స్పైస్‌జెట్ ఒక ప్రత్యేక ఆఫర్ ప్రారంభించింది. దీని కింద విమాన టికెట్ల బుకింగ్, అప్‌గ్రేడ్, ఆహారం, ఇతరత్రా దేనిపై అయినా ఖర్చు చేసే ప్రతీ రూ.100కి 10 రివార్డు పాయింట్లు...

న్యూఢిల్లీ : తరచుగా విమానయానం చేసే కస్టమర్ల కోసం ‘స్పైస్ క్లబ్’ పేరిట స్పైస్‌జెట్ ఒక ప్రత్యేక ఆఫర్ ప్రారంభించింది. దీని కింద విమాన టికెట్ల బుకింగ్, అప్‌గ్రేడ్, ఆహారం, ఇతరత్రా దేనిపై అయినా ఖర్చు చేసే ప్రతీ రూ.100కి 10 రివార్డు పాయింట్లు జత అవుతూ ఉంటాయి. ఒక్కో రివార్డు పాయింటు విలువ 0.50 పైసలు. స్పైస్‌జెట్ ప్రోగ్రాం కింద క్లాసిక్, సిల్వర్, గోల్డ్, ప్లాటినం విభాగాలుంటాయని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.