దెబ్బతిన్న రంగాలకు త్వరలో సహాయ ప్యాకేజీ

ABN , First Publish Date - 2020-03-21T06:44:55+05:30 IST

కోవిడ్‌-19తో దెబ్బతిన్న రంగాలను ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇందుకోసం ప్రత్యేక సహాయ ప్యాకేజీ ప్రకటిస్తామని ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌ చెప్పారు. ఎప్పటిలోగా ఈ ప్యాకేజీ ప్రకటించేది ఇప్పటికిప్పుడు చెప్పడం

దెబ్బతిన్న రంగాలకు త్వరలో సహాయ ప్యాకేజీ

న్యూఢిల్లీ: కోవిడ్‌-19తో దెబ్బతిన్న రంగాలను ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇందుకోసం ప్రత్యేక సహాయ ప్యాకేజీ ప్రకటిస్తామని ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌ చెప్పారు. ఎప్పటిలోగా ఈ ప్యాకేజీ ప్రకటించేది ఇప్పటికిప్పుడు చెప్పడం కష్టమన్నారు. అయితే వీలైనంత త్వరలోనే ఈ సహాయ ప్యాకేజీ ప్రకటిస్తామన్నారు. ఆర్థిక మంత్రి శుక్రవారం వివిధ మంత్రులు, మం త్రిత్వ శాఖల అధికారులతో సమావేశమై ఆయా రంగాలపై కోవిడ్‌-19 ప్రభావాన్ని సమీక్షించారు. పౌర విమానయానం, పశు సంవర్ధక శాఖ, పర్యాటక, ఎంఎ్‌సఎంఈ శాఖల మం త్రులు, అధికారులు ఈ సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు. ఈ పరిస్థితి నుంచి బయటపడేందుకు ఆయా రంగాలు కోరుతున్న డిమాండ్లను అధికారులు తెలయజేసినట్టు సీతారామన్‌ చెప్పారు. శనివారం జరిగే మరో సమావేశంలో కష్టాల్లో ఉన్న రంగాల్ని ఆదుకునేందుకు చేపటాల్సిన కార్యాచరణ ప్రణాళికను ఖరారు చేస్తామన్నారు.

Updated Date - 2020-03-21T06:44:55+05:30 IST