9000 దిగువన స్వల్పకాలిక కరెక్షన్ -టెక్ వ్యూ
ABN , First Publish Date - 2020-05-18T07:09:51+05:30 IST
నిఫ్టీ గత వారం సైడ్‌వేస్, కన్సాలిడేషన్ ధోరణిలో ఉండి 115 పాయింట్ల నష్టంతో వారం కనిష్ఠ స్థాయిలో ముగియడం అప్రమత్త సంకేతం. వీక్లీ చార్టుల్లో దిగువకు రివర్సల్ బార్ ఏర్పడడం మరింత అప్రమత్తతను...

నిఫ్టీ గత వారం సైడ్‌వేస్, కన్సాలిడేషన్ ధోరణిలో ఉండి 115 పాయింట్ల నష్టంతో వారం కనిష్ఠ స్థాయిలో ముగియడం అప్రమత్త సంకేతం. వీక్లీ చార్టుల్లో దిగువకు రివర్సల్ బార్ ఏర్పడడం మరింత అప్రమత్తతను సూచిస్తోంది. 9500 వద్ద లదొక్కుకోలేకపోయినందు వల్ల తక్షణ బుల్లిష్ ట్రెండ్ అవకాశాలు కూడా అంతరించిపోయాయి. ప్రస్తు తం 25 డిఎంఏ దిగువకు వచ్చింది. ఈ స్థాయిల్లో పునరుజ్జీవం సాధించి తీరాలి. ఆర్‌ఎ్‌సఐ సూచీ 50 శాతం వద్ద ఉన్నందు వల్ల మార్కెట్ ప్రధాన దిశకు సమాయత్తం అవుతోంది. స్వల్పకాలిక ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉండాలి. మార్కెట్ 9000 వద్ద పరీక్ష ఎదుర్కొనే ఆస్కారం ఉంది.
బుల్లిష్ స్థాయిలు: గత రెండు రోజుల్లో ఏర్పడిన మైనర్ టాప్ 9300. ఆ పైన మాత్రమే మరింత అప్‌ట్రెండ్ ఉంటుంది. ప్రధాన నిరోధం 9500. ఈ స్థాయి కన్నా బలంగా క్లోజయితే స్వల్పకాలిక బుల్లిష్ ట్రెండ్ కొనసాగుతుంది.
బేరిష్ స్థాయిలు: భద్రత కోసం మైనర్ మద్దతు స్థాయి 9000 వద్ద నిలదొక్కుకుని తీరాలి. అంత కన్నా దిగజారితే స్వల్పకాలిక కరెక్షన్ మరింతగా ఉంటుంది. ప్రధాన మద్దతు స్థాయిలు 8550, 8500.
బ్యాంక్ నిఫ్టీ: ఈ సూచీకి ప్రధాన నిరోధం 19500. ఆ పైన నిలదొక్కుకుంటే మరింత అప్‌ట్రెండ్ ఉంటుంది.
పాటర్న్: 9000 వద్ద ‘‘అడ్డంగా కనిపిస్తున్న సపోర్ట్ ట్రెండ్‌లైన్’’ కన్నా దిగజారితే స్వల్పకాలిక బలహీనత ఏర్పడుతుంది. ‘‘ఏటవాలుగా ఏర్పడిన రెసిస్టెన్స్ ట్రెండ్‌లైన్’’ కన్నా మార్కెట్ ప్రస్తుతం దిగువన ఉంది. అప్‌ట్రెండ్ కోసం ఆ రేఖ కన్నా పైకి రావాలి.
టైమ్ : ఈ సూచి ప్రకారం గురువారం తదుపరి రివర్సల్ కనబడుతోంది. వీక్లీ చార్టుల్లో కూడా టాప్ ఏర్పడినందు వల్ల స్వల్పకాలంలో మరింత కరెక్షన్ లేదా కన్సాలిడేషన్ ఉండవచ్చు.
సోమవారం స్థాయిలు
నిరోధం : 9220, 9300
మద్దతు : 9080, 9000