క్రెడిట్, డెబిట్ కార్డు హోల్డర్లకు షాక్... ఫోన్ నెంబర్లు కూడా లీక్

ABN , First Publish Date - 2020-12-11T19:26:05+05:30 IST

దేశవ్యాప్తంగా 70 లక్షల మంది డెబిట్, క్రెడిట్ కార్డు హోల్డర్ల వ్యక్తిగత వివరాలు లీకయ్యాయి. వారి ఫోన్ నంబర్లు, ఈ మెయిల్ అడ్రస్‌లు సహా వ్యక్తిగత వివరాలు కూడా డార్క్ వెబ్‌లో ప్రత్యక్షమయ్యాయి.

క్రెడిట్, డెబిట్ కార్డు హోల్డర్లకు షాక్... ఫోన్ నెంబర్లు కూడా లీక్

ముంబై : దేశవ్యాప్తంగా 70 లక్షల మంది డెబిట్, క్రెడిట్ కార్డు హోల్డర్ల  వ్యక్తిగత వివరాలు లీకయ్యాయి. వారి ఫోన్ నంబర్లు, ఈ మెయిల్ అడ్రస్‌లు సహా వ్యక్తిగత వివరాలు కూడా డార్క్ వెబ్‌లో ప్రత్యక్షమయ్యాయి. ఇంటర్‌నెట్ సెక్యూరిటీ రీసెర్చర్ ఈ మేరకు అలర్ట్ చేశారు. లీకైన వివరాల్లో యూజర్ల పేర్లు, యాజమాన్యాల పేర్లు, ఏడాది ఆదాయం వంటి వివరాలు కూడా లీకైనట్లు సెక్యూరిటీ రీసెర్చర్ రాజశేఖర్ రాజాహారియా వెల్లడించారు.


లీకైన డేటాలో క్రెడిట్, డెబిట్ కార్డు కస్టమర్ల పేర్లు, ఫోన్ నెంబర్లు, ఆదాయ వివరాలు, ఖాతా వివరాలు కూడా ఉన్నాయి. బయటకు వచ్చిన డేటాలో 2010 నుండి 2019 మధ్య నాటి వినియోగదారుల సమాచారముంది. అంతేకాదు... యూజర్ల అకౌంట్, మొబైల్ ఫోన్  స్టేటస్ తదితర వివరాలు కూడా ఉన్నాయి. 


మొత్తం 70 లక్షల క్రెడిట్, డెబిట్ కార్డు హోల్డర్లకు షాక్...

కాగా... సుమారు 70 లక్షల మంది కార్డుహెోల్డర్ల డేటా లీకై ఉండవచ్చని భావిస్తున్నారు. ఇది ఫైనాన్షియల్ డేటా కాబట్టి సైబర్ నేరాలు, మోసాలు, ఫిషింగ్ దాడులు, ఆన్‌లైన్ మోసాలకు వినియోగించవచ్చని చెబుతున్నారు. బ్యాంకులతో ఒప్పందం కుదుర్చుకున్న థర్డ్ పార్టీ సర్వీస్ ప్రొవైడర్ల నుండి ఈ డేటా బహిర్గతమై ఉండవచ్చునని భావిస్తున్నారు. లీకైన డేటా బేస్‌లో ఐదు లక్షల మంది కార్డు హోల్డర్ల పాన్ నెంబర్లు కూడా ఉన్నట్లుగా వినవస్తోంది. ఈ డేటాలో యాక్సిస్ బ్యాంకు, భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్, కెల్లాగ్, మెకెన్సీ అండ్ కంపెనీలో పని చేసే ఉద్యోగులతో పాటు మరింతమంది సమాచారం ఉండవచ్చునని ఇంక్ 42 తన నివేదికలో వెల్లడించింది. 

Updated Date - 2020-12-11T19:26:05+05:30 IST