లాక్‌డౌన్ పొడిగింపు వార్తలతో స్టాక్ మార్కెట్లు ఢమాల్!

ABN , First Publish Date - 2020-04-08T21:51:25+05:30 IST

మంగళవారం ఆకాశమే హద్దుగా దూసుకెళ్లిన దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ మళ్లీ నేలచూపులు చూశాయి. ఈ నెల ..

లాక్‌డౌన్ పొడిగింపు వార్తలతో స్టాక్ మార్కెట్లు ఢమాల్!

ముంబై: మంగళవారం ఆకాశమే హద్దుగా దూసుకెళ్లిన దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ మళ్లీ నేలచూపులు చూశాయి. ఈ నెల 14తో ముగియనున్న లాక్‌డౌన్‌ను పొడిగించే అవకాశం ఉందన్న వార్తలతో పాటు నష్టాలతో ప్రారంభమైన యూరోపియన్ మార్కెట్లు సైతం ఇన్వెస్టర్ల సెంటిమెంటును దెబ్బతీశాయి. దీంతో ఇవాళ ట్రేడింగ్ ముగిసే సమయానికి బీఎస్‌ఈ సెన్సెక్స్ 173.25 (0.58 శాతం) పాయింట్ల నష్టంతో 29,893.96 వద్ద క్లోజ్ అయ్యింది. మరోవైపు ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ సైతం 37.80 పాయింట్లు (0.43 శాతం) నష్టపోయి 8,754.40 వద్ద ముగిసింది. 

Updated Date - 2020-04-08T21:51:25+05:30 IST