‘కార్వీ’పై నిషేధం
ABN , First Publish Date - 2020-11-25T06:46:07+05:30 IST
కార్వీ స్టాక్ బ్రోకింగ్ లిమిటెడ్ (కేఎ్‌సబీఎల్)పై విధించిన నిషేధాన్ని కొనసాగిస్తూ మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ తుది ఉత్తర్వులు జారీ చేసింది. కేఎ్‌సబీఎల్ కొత్త ఖాతాదారుల్ని చేర్చుకోవడాన్ని నిషేధిస్తూ సెబీ గత ఏడా ది నవంబరులోనే తాత్కాలిక ఉత్తర్వులు జారీ చేసింది...

- తుది ఉత్తర్వులు జారీ చేసిన సెబీ
- డైరెక్టర్లు, సంస్థపై చర్యలు తీసుకోండి
- స్టాక్ ఎక్స్ఛేంజీలు, డిపాజిటరీ సంస్థలకు ఆదేశం
న్యూఢిల్లీ: కార్వీ స్టాక్ బ్రోకింగ్ లిమిటెడ్ (కేఎ్‌సబీఎల్)పై విధించిన నిషేధాన్ని కొనసాగిస్తూ మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ తుది ఉత్తర్వులు జారీ చేసింది. కేఎ్‌సబీఎల్ కొత్త ఖాతాదారుల్ని చేర్చుకోవడాన్ని నిషేధిస్తూ సెబీ గత ఏడా ది నవంబరులోనే తాత్కాలిక ఉత్తర్వులు జారీ చేసింది. పవర్ ఆఫ్ అటార్నీ పేరుతో కార్వీ తన ఖాతాదారుల డీమ్యాట్ ఖాతాల్లోని రూ.2,000 కోట్ల విలువైన షేర్లు, ఇతర సెక్యూరిటీలను అక్రమంగా తన డీమ్యాట్ ఖాతాల్లోకి బదిలీ చేసుకుని, వాటిని తనఖా పెట్టినట్లు వెల్లడి కావటంతో సెబీ ఈ చర్య తీసుకుంది. ఈ అక్రమాలు నిజమని ఫోరెన్సిక్ ఆడిట్‌లో తేలినట్టు ఈ మధ్యనే ఎన్‌ఎ్‌సఈ..సెబీకి వెల్లడించింది. దీంతో కార్వీపై ఉన్న నిషేఽధాన్ని కొనసాగించాలని సెబీ నిర్ణయించింది. దీనికితోడు నిబంధనలు తుంగలో తొక్కిన కేఎస్‌బీఎల్, దాని డైరెక్టర్లపై స్టాక్ ఎక్స్చేంజీలు, డిపాజిటరీ సంస్థలు కూడా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.కాగా తాము పంపిన ఒక్క నోటీసుకూ కార్వీ సమాధానం ఇవ్వలేదని పేర్కొంది.
సభ్యత్వం రద్దు : ఎన్‌ఎ్‌సఈ
సెబీ నిర్ణయం వెలువడిన కొద్దిసేపటికే కేఎ్‌సబీఎల్ సభ్యత్వాన్ని రద్దు చేసినట్టు ఎన్‌ఎ్‌సఈ ప్రకటించింది. ఖాతాదారులకు సంబంధించిన రెగ్యులేటరీ నిబందనలను పాటించక పోవటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. సోమవారం నుంచే కార్వీ స్టాక్ బ్రోకింగ్ సభ్యత్వ రద్దు నిర్ణయం అమల్లోకి వచ్చింది. కాగా కార్వీ కంపెనీ ట్రేడింగ్ ఖాతాను ఎన్‌ఎ్‌సఈ గత ఏడాది డిసెంబరులోనే నిలిపివేసింది.