సీవేస్‌ షిప్పింగ్‌, ఎంఓఎల్‌ లాజిస్టిక్స్‌ ఒప్పందం

ABN , First Publish Date - 2020-12-29T06:16:16+05:30 IST

దేశవ్యాప్తంగా సప్లై చెయిన్‌, టర్న్‌కీ లాజిస్టిక్స్‌ సేవలందించడానికి హైదరాబాద్‌కు చెందిన సీవేస్‌ షిప్పింగ్‌, ఎంఓఎల్‌ లాజిస్టిక్స్‌ (

సీవేస్‌ షిప్పింగ్‌, ఎంఓఎల్‌ లాజిస్టిక్స్‌ ఒప్పందం

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): దేశవ్యాప్తంగా సప్లై చెయిన్‌, టర్న్‌కీ లాజిస్టిక్స్‌ సేవలందించడానికి హైదరాబాద్‌కు చెందిన సీవేస్‌ షిప్పింగ్‌, ఎంఓఎల్‌ లాజిస్టిక్స్‌ (ఇండి యా) అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి. వేర్‌హౌసింగ్‌, కస్టమ్స్‌ క్లియరెన్స్‌, కంటైనర్‌ లైన్‌, వెజల్‌ ఏజెన్సీ, రవాణా/ట్రక్కింగ్‌, బల్క్‌ కార్గో హ్యాండ్లింగ్‌ సప్లై చెయిన్‌ మేనేజ్‌మెంట్‌, ప్రొక్యూర్‌మెంట్‌ తదితర టర్న్‌కీ లాజిస్టిక్స్‌ సేవలు ఒప్పందం కిందకు వస్తాయని సీవేస్‌ షిప్పింగ్‌ డైరెక్టర్‌ (మార్కెటింగ్‌) పీ వివేక్‌ ఆనంద్‌ తెలిపారు.


దేశ, విదేశాల్లోని ఖాతాదారుల నుంచి వివిధ ప్రాజెక్టులను చేపట్టడానికి, రెండు కంపెనీలు కలిసి పని చేసేందుకు ఈ ఒప్పందం దోహదం చేస్తుందన్నారు. ఎంఓఎల్‌ లాజిస్టిక్స్‌ ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రాంతాలకు విస్తరించాలని భావిస్తోంది. భారత్‌లో వృద్ధి అవకాశాలు బాగున్నాయి. సీవేస్‌ షిప్పింగ్‌తో కుదుర్చుకున్న ఒప్పందం రెండు కంపెనీలకు ప్రయోజనం చేకూరుస్తుందని ఎంఓఎల్‌ లాజిస్టిక్స్‌ (ఇండియా) డైరెక్టర్‌ రొయోజి యమమోటో తెలిపారు. 


Updated Date - 2020-12-29T06:16:16+05:30 IST