ఎస్‌బీఐ లైఫ్ స్మార్ట్ ఫ్యూచర్ ఛాయిసెస్
ABN , First Publish Date - 2020-12-27T09:37:48+05:30 IST
స్మార్ట్ ఫ్యూచర్ చాయిసెస్ పేరుతో ఇండివిడ్యువల్, నాన్-లింక్డ్, పార్టిసిపేటింగ్ లైఫ్ ఇన్సూరెన్స్ సేవింగ్స్ పథకాన్ని ప్రవేశపెట్టింది. కాలానుగుణంగా

ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్.. స్మార్ట్ ఫ్యూచర్ చాయిసెస్ పేరుతో ఇండివిడ్యువల్, నాన్-లింక్డ్, పార్టిసిపేటింగ్ లైఫ్ ఇన్సూరెన్స్ సేవింగ్స్ పథకాన్ని ప్రవేశపెట్టింది. కాలానుగుణంగా మారే అవసరాలకు అనుగుణంగా ఈ పాలసీ కాలపరిమితి పొడుగునా కస్టమర్లు పలు ఆప్షన్లు, ప్రయోజనాలను ఎంచుకునేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది. ఇందులో ప్రీమియం సొమ్ము, ప్రీమియం చెల్లింపు కాలపరిమితి లేదా పాలసీ టర్మ్‌ను కస్టమర్లే ఎంపిక చేసుకునే అవకాశం ఉంటుంది.