కొత్త శ్రేణి స్మార్ట్‌టీవీలను విడుదల చేసిన శాంసంగ్

ABN , First Publish Date - 2020-06-16T21:40:21+05:30 IST

దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్ దిగ్గజం శాంసంగ్ కొత్త శ్రేణి స్మార్ట్ టీవీలను మార్కెట్లో విడుదల చేసింది. ఇందులో మొత్తం 10

కొత్త శ్రేణి స్మార్ట్‌టీవీలను విడుదల చేసిన శాంసంగ్

న్యూఢిల్లీ: దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్ దిగ్గజం శాంసంగ్ కొత్త శ్రేణి స్మార్ట్ టీవీలను మార్కెట్లో విడుదల చేసింది. ఇందులో మొత్తం 10 రకాల ఆప్షన్లు ఉన్నాయి. ఈ నెల 19 నుంచి ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, శాంసంగ్ అధికారిక ఆన్‌‌లైన్ స్టోర్ శాసంగ్ షాప్‌ల ద్వారా వినియోగదారులకు అందుబాటులో ఉండనున్నాయి. 


50 అంగుళాల టీవీ ధర రూ. 74,990 నుంచి ప్రారంభం కానుంది. 55 అంగుళాల టీవీ ధర రూ. 84,990. 65 అంగుళాల అతిపెద్ద టీవీ రేంజ్ ధర రూ. 1,39,990 మాత్రమే. 43 అంగుళాల 4కె యూహెచ్‌డీ స్మార్ట్ టీవీ ధర రూ. 36,990తో ప్రారంభం కానుండగా, 4కె యూహెచ్‌డీ 65 అంగుళాల వెర్షన్ ధర రూ. 89,990. 

 

 32 అంగుళాల ఎఫ్‌హెచ్‌డీ, హెడ్‌డీ రెడీ స్మార్ట్ టీవీ మోడళ్ల ధరలు రూ. 14,490 నుంచి ప్రారంభం కానుండగా, 43 అంగుళాల మోడల్ ధర రూ. 31,990. ఈ కొత్త శ్రేణి టీవీలకు ఏడాది పాటు వారెంట్ లభించనుంది. అలాగే, ప్యానెల్‌పై అదనంగా మరో ఏడాదిపాటు వారెంటీ లభిస్తుంది. దీంతోపాటు పదేళ్లపాటు నో స్క్రీన్ బర్న్ ఇన్ వారెంటీ, ఏడాదిపాటు సమగ్ర వారెంటీ లభిస్తుంది. 


 ఫ్రేమ్ 2020 టీవీలపై రూ. 3,125తో 24 నెలలపాటు నోకాస్ట్ ఈఎంఐ ఆప్షన్లను శాంసంగ్ ఆఫర్ చేస్తోంది. స్మార్ట్‌టీవీలపై 18 నెలలపాటు రూ. 805తో నోకాస్ట్ ఈఎంఐ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. వీటితోపాటు మరిన్ని ఆఫర్లను శాంసంగ్ అందిస్తోంది. 


Updated Date - 2020-06-16T21:40:21+05:30 IST