శాంసంగ్ ‘స్టే హోమ్ - స్టే హ్యాపీ’ ప్రీ బుక్‌ ఆఫర్

ABN , First Publish Date - 2020-05-05T23:08:30+05:30 IST

లాక్‌డౌన్‌ను ఎత్తివేసిన వెంటనే డిజిటల్ అప్లయెన్సెస్ కొనుగోలు చేయాలనుకుంటున్న వినియోగాదారుల కోసం ప్రముఖ ఎలక్ట్రానిక్స్‌...

శాంసంగ్ ‘స్టే హోమ్ - స్టే హ్యాపీ’ ప్రీ బుక్‌ ఆఫర్

న్యూఢిల్లీ: లాక్‌డౌన్‌ను ఎత్తివేసిన వెంటనే డిజిటల్ అప్లయెన్సెస్ కొనుగోలు చేయాలనుకుంటున్న వినియోగాదారుల కోసం ప్రముఖ ఎలక్ట్రానిక్స్‌ బ్రాండ్ శాంసంగ్‌ సరికొత్త ఆఫర్‌ను తీసుకొచ్చింది. ‘స్టే హోమ్ - స్టే సేఫ్టీ... లాగ్‌ ఇన్‌టు గ్రేట్‌ ఆఫర్స్‌’ పేరుతో తీసుకొచ్చిన ఈ ఆఫర్ ద్వరా  వినియోగదారులు ఇళ్లనుంచి బయటకు రాకుండానే తమకు అవసరమైన వాటిని ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చు. https://www.samsung.com/in/offer/online/ce-sale వెబ్‌సైట్ ద్వారా కావలసిన వస్తువులను వెదకడంతో పాటు బుక్  చేసుకునే అవకాశాన్ని వినియోగదారులకు శాంసంగ్ కల్పించింది. ఈ ఆఫర్‌ను వినియోగించి ఈ నెల 8వ తేదీ వరకు బుక్ చేసుకున్న వారికి 15% రాయితీ లభించడంతో పాటు, వడ్డీలేని రుణ సదుపాయం లభిస్తుందని, 18 నెలల వరకు సులభ వాయిదాలలో చెల్లించవచ్చని తెలిపింది. లాక్‌డౌన్ తొలగించిన వెంటనే దగ్గరలోని శాంసంగ్ స్టోర్‌ నుంచి ఈ పరికరాలు డోర్ డెలివరీ చేయబడతాయని వెల్లడించింది. టెలివిజన్స్‌, రిఫ్రిజిరేటర్లు, ఎయిర్‌కండిషనర్లు, వాషింగ్‌ మెషీన్లు, స్మార్ట్‌ ఓవెన్స్‌ మొదలైన అన్ని రకాల డిజిటల్ పరికరాలకు ఈ ఆఫర్ వర్తిస్తుందని శాంసంగ్ వెల్లడించింది. 


ఇదిలా ఉంటే శాంసంగ్‌ టెలివిజన్లను కొనుగోలు చేసిన వినియోగదారులకు ప్యానెల్‌పై 1+1 ఎక్స్‌టెండెడ్‌ వారెంటీ లభిస్తుందని, జీ5 ప్రీమియం ప్యాక్‌‌తో 30 రోజుల ట్రయల్‌ ఆఫర్‌ను సైతం పొందవచ్చని  శాంసంగ్‌ ఇండియా కన్స్యూమర్‌ ఎలక్ట్రానిక్స్‌ బిజినెస్‌ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ రాజు పుల్లన్‌ వెల్లడిచారు. స్మార్ట్‌ ఓవెన్స్‌ బుక్ చేసుకున్న వారికి 10 సంవత్సరాల సెరామిక్‌ ఎనామిల్‌ వారెంటీ లభిస్తుందని, అంతేకాకుండా ఉచిత బోరోసిల్‌ కిట్‌, 5 సంవత్సరాల మ్యాగ్నెట్రాన్‌ వారెంటీన లభిస్తుందని వివరించారు. రిఫ్రిజిరేటర్లు , డిజిటల్‌ ఇన్వర్టర్‌ కంప్రెషర్లపై 10 సంవత్సరాల వారెంటీ లభిస్తుందని, వాషింగ్‌ మెషీన్ల బుక్ చేసుకుంటే మోటర్‌కు 10–12 సంవత్సరాల వారెంటీ అందిస్తామని, ఎయిర్‌కండీషనర్లపై ఉచిత ఇన్‌స్టాలేషన్‌ ఆఫర్‌తో పాటుకండెన్సర్‌, పీసీబీ కంట్రోలర్లకు  5  సంవత్సరాల వారెంటీ, ఉచిత ఏసీ గ్యాస్‌ రీచార్జ్‌ ఆఫర్ లభిస్తుందని ఆయన వివరించారు.

Updated Date - 2020-05-05T23:08:30+05:30 IST