ఫ్యూచర్ రిటైల్ షేర్ల విక్రయం
ABN , First Publish Date - 2020-09-12T06:21:36+05:30 IST
ఫ్యూచర్ రిటైల్లోని షేర్లను పాక్షికంగా లేదా పూర్తిగా విక్రయించాలని హెరిటేజ్ ఫుడ్స్ బోర్డు నిర్ణయించింది.

హెరిటేజ్ నిర్ణయం
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్):ఫ్యూచర్ రిటైల్లోని షేర్లను పాక్షికంగా లేదా పూర్తిగా విక్రయించాలని హెరిటేజ్ ఫుడ్స్ బోర్డు నిర్ణయించింది. కంపెనీ వద్ద 1.78 కోట్లకు పైగా ఫ్యూచర్ రిటైల్ షేర్లు ఉన్నా యి. వీటితో పాటు ప్రాక్సిస్ హోమర్ రిటైల్లోని 8,92,371 షేర్లను కూడా విక్రయించనుంది. విడతల వారీగా ఓపెన్ మార్కెట్లో విక్రయం లేదా మర్చంట్ బ్యాంకర్ నియమించుకోవటం ద్వారా దీన్ని పూర్తి చేయాలని నిర్ణయించింది. ఈ ప్రక్రియను పూర్తి చేయడానికి కంపెనీ వైస్ చైర్పర్సన్, ఎండీ ఎన్ భువనేశ్వరికి బోర్డు అధికారం ఇచ్చింది.