రుపీ.. కాస్త రికవరీ
ABN , First Publish Date - 2020-03-25T06:49:43+05:30 IST
వరుసగా నాలుగు సెషన్లపాటు పతనమై జీవితకాల కనిష్ఠానికి పడిపోయిన రూపాయి విలువ స్వల్పంగా కోలుకుంది. సోమవారం నాడు 76.20 స్థాయికి బలహీనపడిన డాలర్-రూపాయ...

వరుసగా నాలుగు సెషన్లపాటు పతనమై జీవితకాల కనిష్ఠానికి పడిపోయిన రూపాయి విలువ స్వల్పంగా కోలుకుంది. సోమవారం నాడు 76.20 స్థాయికి బలహీనపడిన డాలర్-రూపాయి మారకం రేటు.. మంగళవారం 26 పైసలు బలపడి 75.94 వద్ద క్లోజైంది. కరోనా సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు భారీ ప్యాకేజీ ప్రకటించనున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సంకేతాలివ్వడం రూపాయి కోలుకునేందుకు దోహదపడింది.