నేటి నుంచీ నిరంతరంగా ఆర్‌టీజీఎస్ సేవలు!

ABN , First Publish Date - 2020-12-01T16:52:32+05:30 IST

భారత్ ప్రజలకు నేటి నుంచి ఆర్‌టీజీఎస్ సేవలు నిరంతరంగా అందుబాటులోకి వచ్చాయి. ఇకపై ఎప్పుడైన బ్యాంకు అకౌంట్ల మధ్య నగదు బదిలీ చేసే సౌలభ్యం మంగళవారం నుంచీ అందుబాటులో వచ్చింది.

నేటి నుంచీ నిరంతరంగా ఆర్‌టీజీఎస్ సేవలు!

న్యూఢిల్లీ: భారత్ ప్రజలకు నేటి నుంచి నిరంతర ఆర్‌టీజీఎస్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఇకపై ఎప్పుడైన బ్యాంకు అకౌంట్ల మధ్య నగదు బదిలీ చేసే సౌలభ్యం అందుబాటులో వచ్చింది. దేశంలో డిజిటల్ లావాదేవీలు ప్రోత్సహించేందుకు డిసెంబర్ నుంచి నిరంతర ఆర్‌టీజీఎస్ సేవలు అందుబాటులోకి వస్తాయని రిజర్వ్ బ్యాంక్ ఈ ఏడాది అక్టోబర్‌లో ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే.. ఆర్‌టీజీఎస్ సేవల ద్వారా కనీసం రూ. 2 లక్షల నగదు ట్రన్ఫర్ చేయాల్సి ఉంటుంది. గరిష్ట మొత్తం విషయంలో మాత్రం ఎటువంటి పరిమితి లేదు. దీంతో రియల్ టైమ్ నగదు బదిలీ సౌకర్యం కల్పించే అతి కొద్ది దేశాల సరసన భారత్‌ కూడా వచ్చి చేరింది. 

Updated Date - 2020-12-01T16:52:32+05:30 IST