రిటైల్‌ ద్రవ్యోల్బణం డౌన్‌, టోకు ద్రవ్యోల్బణం అప్‌

ABN , First Publish Date - 2020-12-15T06:55:04+05:30 IST

తృణధాన్యాలు, పళ్లు, పాల ధరలు తగ్గడంతో దేశంలో నవంబరు నెలలో రిటైల్‌ ద్రవ్యోల్బణం 6.93 శాతానికి తగ్గింది.

రిటైల్‌ ద్రవ్యోల్బణం డౌన్‌, టోకు ద్రవ్యోల్బణం అప్‌

న్యూఢిల్లీ: తృణధాన్యాలు, పళ్లు, పాల ధరలు తగ్గడంతో దేశంలో నవంబరు నెలలో రిటైల్‌ ద్రవ్యోల్బణం 6.93 శాతానికి తగ్గింది. ఇందుకు భిన్నంగా టోకు ద్రవ్యోల్బణం 9 నెలల గరిష్ఠ స్థాయికి పెరిగింది. అయినా రిటైల్‌ ద్రవ్యోల్బణం ఇప్పటికీ ఆర్‌బీఐకి ప్రభుత్వం నిర్దేశించిన పరిధి 4 శాతం (2 శాతం పైకి, దిగువకు సర్దుబాటు) కన్నా అధికంగానే ఉంది. రిటైల్‌ ద్రవ్యోల్బణం అక్టోబరులో 7.61 శాతంగా ఉంది. కాగా ఆహార వస్తువుల ధరలు తగ్గినా తయారీ వస్తువుల ధరలు పెరగడంతో టోకు ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం మాత్రం 9 నెల గరిష్ఠ స్థాయి 1.55 శాతానికి చేరింది.  

Updated Date - 2020-12-15T06:55:04+05:30 IST