రెనో సరికొత్త డస్టర్‌

ABN , First Publish Date - 2020-08-18T06:48:58+05:30 IST

రెనో ఇండియా.. మార్కెట్లోకి సరికొత్త ఎస్‌యూవీ డస్టర్‌ను విడుదల చేసింది. 1.3 లీటర్‌ టర్బో పెట్రోల్‌ ఇంజన్‌తో కూడిన ఈ డస్టర్‌ ధరలు రూ.10.49 లక్షల నుంచి రూ.13.59 లక్షల (ఎక్స్‌షోరూమ్‌) మధ్యన ఉన్నాయి...

రెనో సరికొత్త డస్టర్‌

  • 1.3 లీటర్‌ టర్బో పెట్రోల్‌ ఇంజన్‌తో విడుదల 
  • ప్రారంభ  ధర రూ.10.49 లక్షలు 

న్యూఢిల్లీ: రెనో ఇండియా.. మార్కెట్లోకి సరికొత్త ఎస్‌యూవీ డస్టర్‌ను విడుదల చేసింది. 1.3 లీటర్‌ టర్బో పెట్రోల్‌ ఇంజన్‌తో కూడిన ఈ డస్టర్‌ ధరలు రూ.10.49 లక్షల నుంచి రూ.13.59 లక్షల (ఎక్స్‌షోరూమ్‌) మధ్యన ఉన్నాయి. కాగా 1.5 లీటర్‌ పెట్రోల్‌ ఇంజన్‌తో మూడు వేరియంట్లతో ఇప్పటికే మార్కెట్లో ఉన్న డస్టర్‌ను యథాతథంగా కొనసాగించనున్నట్లు రెనో తెలిపింది. డీజిల్‌ ఇంజన్‌తో ఎలాంటి డస్టర్‌ను అందుబాటులోకి తీసుకురావటం లేదని స్పష్టం చేసింది. 1.3 లీటర్‌ టర్బో వెర్షన్‌ను మూడు మాన్యువల్‌ వేరియంట్లతో అందుబాటులో ఉంటుందని పేర్కొంది. వీటి ధరలు వరుసగా రూ.10.49 లక్షలు, రూ.11.39 లక్షలు, రూ.11.99 లక్షలుగా ఉన్నాయి. కాగా సీవీటీ (ఆటోమేటిక్‌) వేరియంట్స్‌ ధరలు రూ.12.99 లక్షలు, రూ.13.59 లక్షలుగా ఉన్నాయని రెనో వెల్లడించింది.

Updated Date - 2020-08-18T06:48:58+05:30 IST