రిలయన్స్ డౌన్...

ABN , First Publish Date - 2020-12-21T00:31:52+05:30 IST

టాప్ 10 కంపెనీల్లోని 8 కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ గత వారం రూ. 1.25 లక్షల కోట్లు పెరిగింది. హెచ్‌డీఎఫ్‌సీ, టీసీఎస్, బజాజ్ ఫైనాన్స్ భారీగా లాభపడ్డాయి. గతవారం బీఎస్ఈ సెన్సెక్స్ 861.68 పాయింట్లు(1.86 శాతం) లాభపడింది. సెన్సెక్స్ చివరి సెషన్‌లో ఏకంగా 47 వేల మార్కును క్రాస్ చేసి, చివరకు 46,960.69 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 13,760 పాయింట్లకు పైగా ఎగిసింది.

రిలయన్స్ డౌన్...

ముంబై : టాప్ 10 కంపెనీల్లోని 8 కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ గత వారం రూ. 1.25 లక్షల కోట్లు పెరిగింది. హెచ్‌డీఎఫ్‌సీ, టీసీఎస్, బజాజ్ ఫైనాన్స్ భారీగా లాభపడ్డాయి. గతవారం బీఎస్ఈ సెన్సెక్స్ 861.68 పాయింట్లు(1.86 శాతం) లాభపడింది. సెన్సెక్స్ చివరి సెషన్‌లో ఏకంగా 47 వేల మార్కును క్రాస్ చేసి, చివరకు 46,960.69 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 13,760 పాయింట్లకు పైగా ఎగిసింది.


 హెచ్‌డీఎఫ్‌సీ, టీసీఎస్, బజాజ్ ఫైనాన్స్, ఇన్ఫోసిస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, కొటక్ మహీంద్రా, ఐసీఐసీఐ, భారతీ ఎయిర్‌టెల్ కంపెనీల మార్కెట్ క్యాప్ పెరిగింది. అత్యధిక వెయిటేజీ కలిగిన రిలయన్స్ ఇండస్ట్రీస్‌తో పాటు హిందూస్తాన్ యూనిలీవర్ లిమిటెడ్ మార్కెట్ క్యాపిటలైజేషన్ క్షీణించింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ స్టాక్ గత కొద్ది రోజులుగా రూ. రెండు వేల కంటే దిగువన ముగుస్తోంది. గత సోమవారం రూ. రెండు వేలకు పైనుంచి పడిపోయి రూ. 1,998 కి పడిపోయింది. 


మార్కెట్ క్యాప్ జంప్...  గత వారం హెచ్‌డీఎఫ్‌సీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 32,992.86 కోట్లు క్షీణించి రూ. 4,46,174.05 కోట్లకు పెరిగింది. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 29,700.13 కోట్లు పెరిగి రూ. 10,74,157.65 కోట్లకు పెరిగింది. బజాజ్ ఫైనాన్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 24,642.81 కోట్లు పెరిగి రూ. 3,16,481.88 కోట్లకు ఎగసింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఎం-క్యాప్ రూ. 15,996.69 కోట్లు పెరిగి రూ. 7,77,119.60 కోట్లకు చేరుకుంది. ఇన్ఫోసిస్ ఎం-క్యాప్ రూ. 11,376.62 ఎగసి రూ. 5,06,777.66 కోట్లకు, కొటక్ మహీంద్రా బ్యాంకు రూ. 5,622.59 కోట్లు పెరిగి రూ. 3,85,870.02 కు చేరింది. భారతీ ఎయిర్‌టెల్ ఎం-క్యాప్ రూ. 3,573.39 కోట్లు పెరిగి రూ. 2,78,560.76 కోట్లకు చేరింది. ఐసీఐసీఐ మార్కెట్ క్యాప్ రూ. 1,324.16 కోట్లు పెరిగి రూ. 3,56,853.67 కోట్లకు చేరింది. 


వీటి మార్కెట్ డౌన్... ఇక, హిందూస్తాన్ యూనీ లీవర్ లిమిటెడ్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 9,868.14 కోట్లు క్షీణించి రూ. 5,47,846.03 కోట్లకు క్షీణించింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 8,463.15 తగ్గి రూ. 12,62,975.08 కోట్లకు తగ్గింది. 


ఓ సమయంలో రూ. 16 లక్షల కోట్లకు చేరుకున్న రిలయన్స్ మార్కెట్ క్యాప్ ఇప్పుడు రూ. 13 లక్షల కోట్ల దిగువకు వచ్చింది. అత్యధిక మార్కెట్ క్యాపిటలైజేషన్ కలిగిన టాప్ 10 కంపెనీలుగా వరుసగా రిలయన్స్ ఇండస్ట్రీస్, టీసీఎస్, హెడ్‌ఎఫ్‌సీ బ్యాంకు, హిందూస్తాన్ యూనీలీవర్ లిమిటెడ్, ఇన్ఫోసిస్, కొటక్ మహీంద్రా బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు, బజాజ్ ఫైనాన్స్, భారతీ ఎయిర్‌టెల్ ఉన్నాయి.


Updated Date - 2020-12-21T00:31:52+05:30 IST