ఎల్‌ఐసీ హౌసింగ్‌ వడ్డీ రేటు తగ్గింపు

ABN , First Publish Date - 2020-04-24T06:12:18+05:30 IST

గృహ రుణాలపై వడ్డీ రేటును 7.5 శాతానికి తగ్గించినట్లు ఎల్‌ఐసీ హౌసింగ్‌ ఫైనాన్స్‌ వెల్లడించింది. అయి తే సిబిల్‌ స్కోరు 800, ఆపైన

ఎల్‌ఐసీ హౌసింగ్‌ వడ్డీ రేటు తగ్గింపు

ముంబై: గృహ రుణాలపై వడ్డీ రేటును 7.5 శాతానికి తగ్గించినట్లు ఎల్‌ఐసీ హౌసింగ్‌ ఫైనాన్స్‌ వెల్లడించింది. అయి తే సిబిల్‌ స్కోరు 800, ఆపైన ఉండి కొత్తగా గృహ రుణాలు తీసుకునే వారికే ఈ వడ్డీ రేటు వర్తిస్తుంది. ఇప్పటికే ఉన్న తమ గృహ రుణాలను లేదా కొత్తగా తీసుకునే గృహ రుణా లను సింగిల్‌ టర్మ్‌ బీమా పాలసీతో అనుసంధానం చేస్తే.. వడ్డీ రేటులో మరో 0.10 శాతం  రాయితీ (7.4 శాతం) లభి స్తుంది. పాలసీదారుడు అనుకోకుండా మరణిస్తే టర్మ్‌ పాల సీ.. ఆ రుణ భారాన్ని పూర్తిగా భరిస్తుందని తెలిపింది. 

Updated Date - 2020-04-24T06:12:18+05:30 IST