ఎట్టకేలకు విక్రయానికి ‘రెడ్‌మీ నోట్ 9 ప్రొ మ్యాక్స్’.. ఫస్ట్ సేల్ ఎప్పుడంటే?

ABN , First Publish Date - 2020-05-11T00:59:33+05:30 IST

దేశంలోని షియోమీ యూజర్లకు ఇది శుభవార్తే. మార్చిలో విడుదలైన ‘రెడ్‌మీ నోట్ 9 ప్రొ మ్యాక్స్’ ఎట్టకేలకు

ఎట్టకేలకు విక్రయానికి ‘రెడ్‌మీ నోట్ 9 ప్రొ మ్యాక్స్’.. ఫస్ట్ సేల్ ఎప్పుడంటే?

న్యూఢిల్లీ: దేశంలోని షియోమీ అభిమానులకు ఇది శుభవార్తే. మార్చిలో విడుదలైన ‘రెడ్‌మీ నోట్ 9 ప్రొ మ్యాక్స్’ ఎట్టకేలకు వినియోగదారులకు అందుబాటులోకి రానుంది. లాక్‌డౌన్ కారణంగా వినియోగదారులకు దూరమైన ఈ ఫోన్ విక్రయాలు ఈనెల 12న మధ్యాహ్నం 12 గంటల నుంచి ప్రారంభం కానున్నాయి. ఎంఐ డాట్ కామ్, అమెజాన్ డాట్ ఇన్ ద్వారా కొనుగోలు చేసుకోవచ్చు. 


రెడ్‌మీ నోట్ 9 ప్రొ మ్యాక్స్ ధరను గత నెలలో కంపెనీ సవరించింది. 6జీబీ+64 జీబీ స్టోరేజీ వేరియంట్ ధరను రూ.1500 పెంచి రూ.16,499గా నిర్ణయించింది. 6జీబీ ర్యామ్+128 స్టోరేజీ మోడల్ ధర రూ.17,999 కాగా, 8జీబీ ర్యామ్+128 జీబీ స్టోరేజీ ఆప్షన్ ధరను వెయ్యి రూపాయలు పెంచి రూ.19,999గా నిర్ణయించింది.


స్పెసిఫికేషన్లు: ఆండ్రాయిడ్ 10 ఓఎస్, 6.67 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ ఐపీఎస్ డిస్‌ప్లే, ఆక్టాకోర్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 720జి ఎస్ఓసీ, మైక్రో ఎస్డీ కార్డు ద్వారా మెమొరీని 512 జీబీకి పెంచుకునే వెసులుబాటు, 64 ఎంపీతో వెనకవైపు క్వాడ్ కెమెరా, 32 ఎంపీ సెల్ఫీ కెమెరా ఉన్న ఈ ఫోన్‌లో 5,020 ఎంఏహెచ్ బ్యాటరీని ఉపయోగించారు.

Updated Date - 2020-05-11T00:59:33+05:30 IST