అతి పెద్ద కెమెరాతో రియల్‌మి నుంచి మరో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్
ABN , First Publish Date - 2020-10-07T23:04:12+05:30 IST
రియల్‌మి 7 సిరీస్‌లో మరో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది. ‘రియల్‌మి 7ఐ’ పేరుతో తాజాగా మార్కెట్లోకి వచ్చిన ఈ ఫోన్‌లో క్వాడ్ రియర్ కెమెరా సెటప్,

న్యూఢిల్లీ: రియల్‌మి 7 సిరీస్‌లో మరో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది. ‘రియల్‌మి 7ఐ’ పేరుతో తాజాగా మార్కెట్లోకి వచ్చిన ఈ ఫోన్‌లో క్వాడ్ రియర్ కెమెరా సెటప్, ఆక్టాకోర్ ప్రాసెసర్ వంటివి ఉన్నాయి. రియల్‌మి 7ఐ 4జీబీ ర్యామ్+64 జీబీ వేరియంట్ ధర రూ. 11,999 కాగా, 128 జీబీ స్టోరేజీ వేరియంట్ రకం ఖరీదు రూ .12,999 మాత్రమే. ఫ్యూజన్ గ్రీన్, ఫ్యూజన్ బ్లూ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. ఈ నెల 15 నుంచి ఫ్లిప్‌కార్ట్, రియల్‌మి డాట్ కామ్, ఆఫ్‌లైన్ స్టోర్ల ద్వారా అందుబాటులోకి రానుంది.
రియల్‌మి 7ఐ స్పెసిఫికేషన్లు: డ్యూయల్ సిమ్ (నానో), ఆండ్రాయిడ్ 10 ఓఎస్, 6.5 అంగుళాల హెచ్‌డి ప్లస్ డిస్‌ప్లే, 90 హెర్ట్‌జ్ రీఫ్రెష్ రేట్, 90 శాతం స్క్రీన్ టు బాడీ రేషియో, ఆక్టాకోర్ స్నాప్ డ్రాగన్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 662 ఎస్ఓసీ, 4జీబీ ర్యామ్, 64 ఎంపీ ప్రైమరీ సెన్సార్‌తో కూడిన క్వాడ్ రియర్ కెమెరా, హోల్‌పంచ్ కటౌట్‌తో కూడిన 16 ఎంపీ సెల్ఫీ షూటర్, 64 జీబీ, 128 జీబీ ర్యామ్ వేరియంట్లు, మైక్రో ఎస్డీ కార్డు ద్వారా మెమొరీని పెంచుకునే వెసులుబాటు, 4జీ ఎల్‌టీఈ, డ్యూయల్ బ్యాండ్ వై-ఫై, బ్లూటూత్ 5.0, 18 వాట్స్ చార్జింగ్ సపోర్ట్‌తో కూడిన 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్నాయి.