క్వాడ్ రియర్ కెమెరాతో మరో రెండు ఫోన్లు లాంచ్ చేసిన రియల్‌మి
ABN , First Publish Date - 2020-09-03T22:49:29+05:30 IST
రియల్‌మి నుంచి మరో రెండు స్మార్ట్‌ఫోన్లు వచ్చేశాయి. రియల్‌మి 7 ప్రొ, రియల్‌మి 7 పేర్లతో భారత్ మార్కెట్లో అడుగుపెట్టిన ఈ ఫోన్లు రెండింట్లోనూ క్వాడ్

న్యూఢిల్లీ: రియల్‌మి నుంచి మరో రెండు స్మార్ట్‌ఫోన్లు వచ్చేశాయి. రియల్‌మి 7 ప్రొ, రియల్‌మి 7 పేర్లతో భారత్ మార్కెట్లో అడుగుపెట్టిన ఈ ఫోన్లు రెండింట్లోనూ క్వాడ్ రియర్ కెమెరా, హోల్ పంచ్ డిస్‌ప్లే డిజైన్ కలిగి ఉన్నాయి. రియల్‌మి 7 ప్రొలో అత్యుత్తమమైన హార్డ్‌వేర్, డాల్బీ అటమోస్‌తో కూడిన డ్యూయల్ స్టీరియో స్పీకర్లు ఉన్నాయి. రియల్‌మి 7 6జీబీ ర్యామ్+128 జీబీ స్టోరేజీ వేరియంట్ ధర రూ. 19,999 కాగా, 8జీబీ +128 స్టోరేజీ ఆప్షన్ ధర రూ. 21,999 మాత్రమే.
రియల్‌మి 7 6జీబీ ర్యామ్+64జీబీ స్టోరేజీ మోడల్ ధర రూ. 14,999 కాగా, 8జీబీ+128 స్టోరేజీ వేరియంట్ ధర రూ. 16,999 మాత్రమే. రియల్‌మి 7 ప్రొ ఈ నెల 14న మధ్యాహ్నం 12 గంటల నుంచి ఫ్లిప్‌కార్ట్, రియల్‌మి డాట్ కామ్‌లలో కొనుగోలు చేసుకోవచ్చు. రియల్‌మి 7 ఈ నెల 10న మధ్యాహ్నం 12 గంటల నుంచి వినియోగదారులకు అందుబాటులోకి రానుంది. ఆ తర్వాతి నుంచి ఆఫ్‌లైన్ స్టోర్లలోనూ అందుబాటులోకి రానున్నాయి.
రియల్‌మి 7 ప్రొ స్పెసిఫికేషన్లు: ఆండ్రాయిడ్ 10 ఓఎస్, 6.4 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే, ఆక్టాకోర్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 720జి ఎస్ఓసీ, 64 ఎంపీ ప్రధాన సెన్సార్‌తో కూడిన రియర్ క్వాడ్ కెమెరా, 32 ఎంపీ సెల్ఫీ కెమెరా, 128 జీబీ అంతర్గత మెమొరీ, మైక్రో ఎస్డీ కార్డు ద్వారా మెమొరీని పెంచుకునే వెసులుబాటు ఉన్నాయి. ఇన్‌డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4,500 ఎంఏహెచ్ బ్యాటరీ, 65W ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీ వంటివి ఉన్న ఈ ఫోన్ బరువు 182 గ్రాములు మాత్రమే.
రియల్‌మి 7 స్పెసిఫికేషన్లు: ఆండ్రాయిడ్ 10 ఓఎస్, 6.5 అంగుళాల ఫుల్‌హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, ఆక్టాకోర్ మీడియాటెక్ హెలియో జి95 చిప్‌సెట్, 64 ఎంపీ ప్రధాన సెన్సార్‌తో వెనకవైపు నాలుగు కెమెరాలు, 16 ఎంపీ సెల్ఫీ కెమెరా వంటివి ఉన్నాయి. 128 జీబీ ఆన్‌బోర్డ్ స్టోరేజీ, ఎస్డీకార్డు ద్వారా మెమొరీని పెంచుకునే వెసులుబాటు ఉన్నాయి. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 30W ఫాస్ట్ చార్జింగ్ కలిగిన ఈ ఫోన్ బరువు 196.5 గ్రాములు.