ధరలు తగ్గుతాయ్‌..!

ABN , First Publish Date - 2020-04-28T05:35:16+05:30 IST

కొనాలనుకునే ఇల్లు లేదా ఫ్లాట్‌ ధర తగ్గాలని ఎవరికి ఉండదు. కరోనా లాంటి కష్ట కాలా ల్లో ఈ ఆశ మరింత ఎక్కువగా ఉంటుంది. రియల్‌ ఎస్టేట్‌ క్లాసిఫైడ్స్‌ వేదిక ‘99ఎకర్స్‌ డాట్‌కామ్‌’ సర్వేలోనూ...

ధరలు తగ్గుతాయ్‌..!

  • 90 శాతం గృహ  కొనుగోలుదారుల్లో ఆశలు


న్యూఢిల్లీ: కొనాలనుకునే ఇల్లు లేదా ఫ్లాట్‌ ధర తగ్గాలని ఎవరికి ఉండదు. కరోనా లాంటి కష్ట కాలా ల్లో ఈ ఆశ మరింత ఎక్కువగా ఉంటుంది. రియల్‌ ఎస్టేట్‌ క్లాసిఫైడ్స్‌ వేదిక ‘99ఎకర్స్‌ డాట్‌కామ్‌’ సర్వేలోనూ ఇదే తేలింది. ముంబై, ఢిల్లీ, హైదరాబాద్‌ సహా దేశంలోని పది ప్రధాన నగరాల్లో ఇల్లు లేదా ఫ్లాట్‌ కొనాలనుకుంటున్న వారిని సర్వే చేసి ఈ సంస్థ ఒక నివేదిక విడుదల చేసింది. ఈ సర్వేలో పాల్గొన్న వారిలో దాదాపు 90 శాతం మంది కరోనా నేపథ్యంలో స్థిరాస్తి ధరలు తగ్గుతాయని కొండంత ఆశతో ఉన్నారు. దీంతో కరోనాకు ముందు, సొంతింటి ఆలోచన ఉన్న వారిలో 40 శాతం మంది, ధరలు తగ్గుతాయని ఏకంగా తమ నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నారు. మిగతా 60 శాతం మంది మాత్రం వచ్చే 12 నెలల్లో ఏదోలా సొంతింటి వాళ్లవ్వాలని భావిస్తున్నారు. కొనుగోలు నిర్ణయాన్ని వాయిదా వేస్తు న్న వారిలో 56 శాతం మంది ప్రస్తుత అనిశ్చితి కారణంగా చెప్పారు.


Updated Date - 2020-04-28T05:35:16+05:30 IST