యూనికార్న్‌ క్లబ్‌లోకి రేజర్‌పే

ABN , First Publish Date - 2020-10-13T07:23:18+05:30 IST

కరోనా నామ సంవత్సరంలోనూ ఆరు స్టార్టప్‌ లు యూనికార్న్‌ క్లబ్‌లోకి చేరాయి. వంద కోట్ల డాలర్లు (రూ.7,300 కోట్లు) అంతకు పైగా విలువ చేసే ప్రైవేట్‌ స్టార్ట్‌పలను యూనికార్న్‌లుగా పిలుస్తారు...

యూనికార్న్‌ క్లబ్‌లోకి రేజర్‌పే

న్యూఢిల్లీ: కరోనా నామ సంవత్సరంలోనూ ఆరు స్టార్టప్‌ లు యూనికార్న్‌ క్లబ్‌లోకి చేరాయి. వంద కోట్ల డాలర్లు (రూ.7,300 కోట్లు) అంతకు పైగా విలువ చేసే ప్రైవేట్‌ స్టార్ట్‌పలను యూనికార్న్‌లుగా పిలుస్తారు. ఈ ఏడాది ఫైనాన్షియల్‌ టెక్నాలజీస్‌ (ఫిన్‌టెక్‌) రంగానికి చెందిన 3 స్టార్ట్‌పలు యూనికార్న్‌లుగా అవతరించగా.. సాఫ్ట్‌వేర్‌, ఎడ్యుటెక్‌, బ్యూటీ విభాగాల నుంచి ఒక్కో స్టార్టప్‌ ఈ హోదాను దక్కించుకున్నాయి. పేమెంట్‌ సొల్యూషన్స్‌ సర్వీసులందించే రేజర్‌పే.. ఈ ఏడాది యూనికార్న్‌గా అవతరించిన ఆరో స్టార్టప్‌. సింగపూర్‌ ప్రభుత్వ వెల్త్‌ ఫండ్‌ జీఐసీ, సికోయా క్యాపిటల్‌ నుంచి తాజాగా 10 కోట్ల డాలర్ల (రూ.731 కోట్లు) ఫండింగ్‌ సేకరించినటు కంపెనీ ప్రకటించింది. తద్వారా కంపెనీ మొత్తం విలువ వంద కోట్ల డాలర్ల స్థాయిని అధిగమించింది. ఈ ఏడాది యూనికార్న్‌లుగా ఎదిగిన మిగతా స్టార్ట ప్‌ల జాబితాలో పైన్‌ ల్యాబ్స్‌, జెరోధా, పోస్ట్‌మ్యాన్‌, అన్‌అకాడమీ, నైకా ఉన్నాయి. 


Updated Date - 2020-10-13T07:23:18+05:30 IST