ఎఫ్‌టీసీసీఐ ప్రెసిడెంట్‌ రమాకాంత్‌ ఇనానీ

ABN , First Publish Date - 2020-07-26T06:16:00+05:30 IST

ఫెడరేషన్‌ ఆఫ్‌ తెలంగాణ చాంబర్స్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ (ఎఫ్‌టీసీసీఐ) ప్రెసిడెంట్‌గా రమాకాంత్‌ ఇనానీ, సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌గా కే భాస్కర్‌ రెడ్డి ఎన్నికయ్యారు...

ఎఫ్‌టీసీసీఐ ప్రెసిడెంట్‌ రమాకాంత్‌ ఇనానీ

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): ఫెడరేషన్‌ ఆఫ్‌ తెలంగాణ చాంబర్స్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ (ఎఫ్‌టీసీసీఐ) ప్రెసిడెంట్‌గా రమాకాంత్‌ ఇనానీ, సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌గా కే భాస్కర్‌ రెడ్డి ఎన్నికయ్యారు. 2020-21కి వీరు ఈ బాధ్యతలు నిర్వహిస్తారు. శనివారం జరిగిన సర్వసభ్య సమావేశంలో వీరిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఎఫ్‌టీసీసీఐ తెలిపింది. గత రెండు దశాబ్దాలుగా చాంబర్‌కు చెందిన వివిధ కమిటీల్లో సభ్యుడిగా రమాకాంత్‌ ఇనానీ సేవలు అందిస్తున్నారు. 2019-2020కి ఆయన సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌గా సేవలందించారు. సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌గా ఎన్నికైన భాస్కర్‌ రెడ్డి క్రీమ్‌లైన్‌ డెయిరీ ప్రొడక్ట్స్‌ వ్యవస్థాపకుడు, మేనేజింగ్‌  డైరెక్టర్‌. డెయిరీ టెక్నాజీలో గ్రాడ్యుయేషన్‌ చేశారు. ఐఎ్‌సబీ నుంచి ఎగ్జిక్యూటివ్‌ ఎంబీఏ పట్టా పొందారు. 


Updated Date - 2020-07-26T06:16:00+05:30 IST