కరోనా కట్టడికి క్వికర్ కూడా..
ABN , First Publish Date - 2020-05-13T06:52:34+05:30 IST
కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు ఆన్‌లైన్ క్లాసిఫైడ్ యాడ్స్ పోర్టల్ ‘క్వికర్’ తన వంతుగా కృషి చేస్తోంది. ఇందులో భాగంగా చేపట్టిన రెండు సామాజిక సేవా ప్రాజెక్టులను విజయవంతంగా అమలు...

బెంగళూరు (ఆంధ్రజ్యోతి): కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు ఆన్‌లైన్ క్లాసిఫైడ్ యాడ్స్ పోర్టల్ ‘క్వికర్’ తన వంతుగా కృషి చేస్తోంది. ఇందులో భాగంగా చేపట్టిన రెండు సామాజిక సేవా ప్రాజెక్టులను విజయవంతంగా అమలు చేస్తోంది. www.helphospitals.in, www.stillopen.quikr.com ద్వారా బెంగళూరు, హైదరాబాద్, చెన్నై నగరాల్లో ఈ సేవలందిస్తోంది. హాస్పిటల్స్‌కు అవసరమైన త్రీ ప్లే మాస్కులు, గ్లౌజ్‌లు, ఇతర వైద్య సామాగ్రి, వెంటిలేటర్లు, శానిటైజర్లను అందిస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది.