రుణ పునర్‌ వ్యవస్థీకరణకు సిద్ధం : యూకో బ్యాంకు

ABN , First Publish Date - 2020-09-14T06:03:15+05:30 IST

ఆర్‌బీఐ మార్గదర్శకాలను పరిగణనలోకి తీసుకుని రుణపునర్‌ వ్యవస్థీకరణకు అర్హుల జాబితా తయారుచేస్తున్నట్టు యూకో బ్యాంకు ప్రకటించింది.

రుణ పునర్‌ వ్యవస్థీకరణకు సిద్ధం : యూకో బ్యాంకు

కోల్‌కతా: ఆర్‌బీఐ మార్గదర్శకాలను పరిగణనలోకి తీసుకుని రుణపునర్‌ వ్యవస్థీకరణకు అర్హుల జాబితా తయారుచేస్తున్నట్టు యూకో బ్యాంకు ప్రకటించింది. రుణపునర్‌ వ్యవస్థీకరణ చేపట్టడానికి తాము ఇప్పటికే బోర్డు అనుమతి పొందామని బ్యాంకు ఎండీ ఏకే గోయెల్‌ తెలిపారు.

ఉద్యోగాలు కోల్పోవడం లేదా వేతనంలో కోత పడడం జరిగి ఉంటే బ్యాంకు అలాంటి రుణగ్రహీతలకు చేయూత ఇస్తుందన్నారు. ఇందుకోసం వారి నుంచి ఫిబ్రవరి, ఆగస్టు నెలల వేతన స్లిప్‌లు కోరనున్నట్టు చెప్పారు.  

Updated Date - 2020-09-14T06:03:15+05:30 IST