పాల్‌రెడ్ టెక్ ఆదాయంలో 260 శాతం వృద్థి
ABN , First Publish Date - 2020-11-21T07:48:02+05:30 IST
ఏకీకృత ప్రాతిపదికన పాల్‌రెడ్ టెక్నాలజీస్ సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికానికి రూ.39.32 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది

హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): ఏకీకృత ప్రాతిపదికన పాల్‌రెడ్ టెక్నాలజీస్ సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికానికి రూ.39.32 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. ఏడాది క్రితం ఇదే కాలం ఆదాయంతో పోలిస్తే 260 శాతం పెరిగినట్లు సీఎ్‌ఫఓ హరీశ్ నాయుడు తెలిపారు. లాభం కూడా 256 శాతం వృద్ధితో రూ.1.5 కోట్లకు చేరింది.