పీఎన్‌బీ, ఓబీసీ విలీన బ్యాంక్‌కు త్వరలో కొత్త పేరు, లోగో

ABN , First Publish Date - 2020-02-08T07:23:11+05:30 IST

పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (పీఎన్‌బీ), యునైటెడ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (యూబీఐ), ఓరియెంటల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ కామర్స్‌ (ఓబీసీ)లు విలీనమవుతున్న ..

పీఎన్‌బీ, ఓబీసీ విలీన బ్యాంక్‌కు త్వరలో కొత్త పేరు, లోగో

కోల్‌కతా: పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (పీఎన్‌బీ), యునైటెడ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (యూబీఐ), ఓరియెంటల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ కామర్స్‌ (ఓబీసీ)లు విలీనమవుతున్న విషయం తెలిసిందే. వీటి విలీనం ద్వారా ఏర్పాటయ్యే కొత్త బ్యాంకు పేరు దాని లోగోను త్వరలోనే కేంద్రం ఆవిష్కరించనున్నట్టు ఓ అధికారి తెలిపారు. ఈ బ్యాంక్‌ దేశంలోనే రెండో అతిపెద్ద బ్యాంక్‌గా ఆవిర్భవించనుంది. దీని వ్యాపార పరిమాణం రూ.18 లక్షల కోట్లు ఉండనుంది. కొత్త బ్యాంకు 2020 ఏప్రిల్‌ ఒకటో తేదీ నుంచి కార్యకలాపాలు సాగించనుంది. 

Updated Date - 2020-02-08T07:23:11+05:30 IST