పిట్టీ ఇంజనీరింగ్ ఆదాయం రూ.135 కోట్లు
ABN , First Publish Date - 2020-10-31T06:55:08+05:30 IST
సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికంలో పిట్టీ ఇంజనీరింగ్ రూ.10.09 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది.

హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికంలో పిట్టీ ఇంజనీరింగ్ రూ.10.09 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గత ఏడాది ఇదే కాలం లాభం రూ.7.01 కోట్లతో పోలిస్తే 43.94 శాతం పెరిగినట్లు వెల్లడించింది. సమీక్షా త్రైమాసికానికి ఆదాయం మాత్రం 6.62 శాతం తగ్గి రూ.144.51 కోట్ల నుంచి రూ.134.95 కోట్లకు చేరింది.
డేటా కంపెనీలకు పవర్ సిస్టమ్‌లు, ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రొపల్షన్ వ్యవస్థలు వంటివి సరఫరా చేయడానికి దీర్ఘకాలిక ప్రాతిపదికన కంపెనీ చేతిలో రూ.600 కోట్ల ఆర్డర్లు ఉన్నట్లు పిట్టీ ఇంజనీరింగ్ సీఎండీ శరద్ బి పిట్టీ తెలిపారు.