లాభాల పంచమి
ABN , First Publish Date - 2020-12-30T08:42:50+05:30 IST
దేశీయ స్టాక్ మార్కెట్ వరుసగా ఐదో రోజూ లాభాల్లో ముగిసింది. మంగళవారం ట్రేడింగ్‌లో ప్రామాణిక సూచీలు సరికొత్త

సరికొత్త ఆల్‌టైం గరిష్ఠాలకు స్టాక్ సూచీలు
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్ వరుసగా ఐదో రోజూ లాభాల్లో ముగిసింది. మంగళవారం ట్రేడింగ్‌లో ప్రామాణిక సూచీలు సరికొత్త జీవనకాల గరిష్ఠాలకు చేరుకున్నాయి. బ్యాంకింగ్, ఐటీ రంగ షేర్లలో కొనుగోళ్లు ఇందుకు దోహదపడ్డాయి. సెన్సెక్స్ 259.33 పాయింట్లు పెరిగి 47,613.08 వద్ద, నిఫ్టీ 59.40 పాయింట్ల లాభంతో 13,932.60 వద్ద ముగిశాయి. సెన్సెక్స్ 47,714.55 వద్ద, నిఫ్టీ 13,967.60 వద్ద ఆల్‌టైం ఇంట్రాడే గరిష్ఠాలను నమోదు చేసుకున్నాయి.
5.41 శాతం లాభపడిన ఇండ్‌సఇండ్ బ్యాంక్ సెన్సెక్స్ టాప్ గెయినర్‌గా నిలిచింది. యాక్సిస్ బ్యాంక్ 2.06 శాతం పుంజుకోగా.. టెక్ మహీంద్రా, హెచ్‌డీఎ్‌ఫసీ, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, హెచ్‌డీఎ్‌ఫసీ బ్యాంక్ ఒక శాతానికి పైగా పెరుగుదలను నమోదు చేసుకున్నాయి. నెస్లే, పవర్‌గ్రిడ్, ఎన్‌టీపీసీ మాత్రం ఒక శాతానికి పైగా నష్టపోయాయి.
రంగాలవారీగా చూస్తే, బీఎ్‌సఈలోని బ్యాంకింగ్ సూచీ 1.41 శాతం, ఫైనాన్స్ ఇండెక్స్ 1.06 శాతం బలపడ్డాయి. ఐటీ సూచీ 0.65 శాతం పెరిగింది. మెటల్, పవర్, ఎనర్జీ ఇండెక్స్‌లు మాత్రం 1.32 శాతం వరకు నష్టపోయాయి.