2020-21లో 130 ఎక్స్‌క్లూజివ్‌ స్టోర్లు

ABN , First Publish Date - 2020-03-18T06:33:46+05:30 IST

భారత్‌లో ఎలక్ట్రిక్‌ కన్‌స్ట్రక్షన్‌ మెటీరియల్స్‌ తయారీ కంపెనీ అయిన పానాసోనిక్‌ లైఫ్‌ సొల్యూషన్స్‌ ఇండియా.. హైదరాబాద్‌లో తొలి ఎక్స్‌క్లూజివ్‌ బ్రాండ్‌ స్టోర్‌ను ప్రారంభించింది. యాంకర్‌...

2020-21లో 130 ఎక్స్‌క్లూజివ్‌ స్టోర్లు

పానాసోనిక్‌ లైఫ్‌ సొల్యూషన్స్‌ 


హైదరాబాద్‌ : భారత్‌లో ఎలక్ట్రిక్‌ కన్‌స్ట్రక్షన్‌ మెటీరియల్స్‌ తయారీ కంపెనీ అయిన పానాసోనిక్‌ లైఫ్‌ సొల్యూషన్స్‌ ఇండియా.. హైదరాబాద్‌లో తొలి ఎక్స్‌క్లూజివ్‌ బ్రాండ్‌ స్టోర్‌ను ప్రారంభించింది. యాంకర్‌ బ్రాండ్‌ కింద ఇప్పటికే పలు ఎలక్ట్రిక్‌ ఉత్పత్తులను పానాసోనిక్‌ విక్రయిస్తున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన స్టోర్‌లో వాణిజ్య, గృహాలకు అవసరమైన అడ్వాన్స్‌డ్‌ ఎలక్ట్రికల్‌ వైరింగ్‌ పరికరాలు, స్విచ్‌గేర్‌, వైర్లు, ఎల్‌ఈడీ లైటింగ్‌ సొల్యూషన్స్‌ అందుబాటులో ఉంటాయని పానాసోనిక్‌ లైఫ్‌ సొల్యూషన్స్‌ ఎండీ వివేక్‌ శర్మ తెలిపారు. కాగా వచ్చే ఆర్థిక సంవత్సరంలో ద్వితీయ శ్రేణి నగరాల్లో 130కి పైగా బ్రాండ్‌ స్టోర్లను ఏర్పాటు చేయాలని చూస్తున్నట్లు చెప్పారు. 

Updated Date - 2020-03-18T06:33:46+05:30 IST