తెలుగులో క్రెడిట్ స్కోర్
ABN , First Publish Date - 2020-08-20T06:34:12+05:30 IST
రుణాలు తీసుకోవడానికి అవసరమైన క్రెడిట్ నివేదిక, స్కోర్‌ను పైసాబజార్ డాట్‌కామ్ ప్రాంతీయ భాషల్లో అందించనుంది. తెలుగుతోపాటు కన్నడ మరాఠీల్లో క్రెడిట్ నివేదికలను ఉచితంగా పైసాబజార్ వెబ్...

హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్) : రుణాలు తీసుకోవడానికి అవసరమైన క్రెడిట్ నివేదిక, స్కోర్‌ను పైసాబజార్ డాట్‌కామ్ ప్రాంతీయ భాషల్లో అందించనుంది. తెలుగుతోపాటు కన్నడ మరాఠీల్లో క్రెడిట్ నివేదికలను ఉచితంగా పైసాబజార్ వెబ్, యాప్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని కంపెనీ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ నవీన్ కుక్రేజా తెలిపారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటకకు చెందిన ఖాతాదారులకు ప్రాంతీయ భాషలో లభించే నివేదికలు ఉపయోగపడగలవన్నారు.