బజాజ్ ఆటో ప్లాంట్‌లో 200 మందికి కరోనా

ABN , First Publish Date - 2020-06-27T01:29:37+05:30 IST

ప్రముఖ ద్విచక్ర వాహన సంస్థ బజాజ్ ఆటో లిమిటెడ్‌కు చెందిన వలుజ్ ప్లాంట్‌లో 200 మందికిపై కార్మికులు కరోనా

బజాజ్ ఆటో ప్లాంట్‌లో 200 మందికి కరోనా

ఔరంగాబాద్: ప్రముఖ ద్విచక్ర వాహన సంస్థ బజాజ్ ఆటో లిమిటెడ్‌కు చెందిన వలుజ్ ప్లాంట్‌లో 200 మందికిపై కార్మికులు కరోనా మహమ్మారి బారినపడ్డారు. బజాజ్ ఆటోకు ఇదే అతిపెద్ద తయారీ యూనిట్ కావడం గమనార్హం. ఏప్రిల్ చివరి వారంలో ఈ ప్లాంట్ తిరిగి తెరుచుకుంది. ప్రస్తుతం ఇక్కడ రెండు షిప్టుల్లో కార్మికులు పనిచేస్తున్నారు. గత మూడు రోజుల్లో ఈ యూనిట్‌లో పనిచేస్తున్న వారిలో 165 మంది కార్మికులు కరోనా బారినపడ్డారు. ఇప్పుడీ సంఖ్య 200 దాటేసింది. గత కొన్ని రోజులుగా కేసుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ ప్లాంట్ మాత్రం ఆపరేషన్ కొనసాగుతోందని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న ఓ వ్యక్తి తెలిపారు. 


Updated Date - 2020-06-27T01:29:37+05:30 IST