గ్రీన్కో ఎనర్జీలో ఓరిక్స్ రూ.7,000 కోట్ల పెట్టుబడులు
ABN , First Publish Date - 2020-09-12T06:21:07+05:30 IST
హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న పునురుత్పాదక ఇంధన వనరుల సంస్థ గ్రీన్కో ఎనర్జీలో జపాన్‌కు చెందిన ఓరిక్స్ కార్పొరేషన్ రూ.7,000 కోట్ల (98 కోట్ల డాలర్లు) పెట్టుబడులు పెడుతోంది.

న్యూఢిల్లీ: హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న పునురుత్పాదక ఇంధన వనరుల సంస్థ గ్రీన్కో ఎనర్జీలో జపాన్‌కు చెందిన ఓరిక్స్ కార్పొరేషన్ రూ.7,000 కోట్ల (98 కోట్ల డాలర్లు) పెట్టుబడులు పెడుతోంది. ఈ పెట్టుబడులతో గ్రీన్‌కోలో మైనారిటీ వాటా తీసుకునేందుకు ఓరిక్స్ సంసిద్ధత వ్యక్తం చేసిందని, ఇందుకు సంబంధించి ముసాయిదా ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు గ్రీన్కో ఎనర్జీ హోల్డిం గ్స్ వెల్లడించింది. ప్రైమరీ, సెంకడరీ లావాదేవీల ద్వారా గ్రీన్కో షేర్లను ఓరిక్స్ చేజిక్కించుకోనుందని గ్రీన్కో ఎండీ, సీఈఓ అనిల్ చలమలశెట్టి తెలిపారు. ఈ లావాదేవీతో కంపెనీ సామర్థ్యం పెరగటమే కాకుండా మరింత వృద్ధి పథంలో సాగే అవకాశం లభిస్తుందని పేర్కొన్నారు.