ప్రపంచ సైకిల్ దినోత్సవం రోజే అట్లాస్ సైకిల్ ప్లాంటు లే ఆఫ్

ABN , First Publish Date - 2020-06-04T12:40:49+05:30 IST

అంతర్జాతీయ సైకిల్ దినోత్సవం రోజే ప్రముఖ సైకిళ్ల తయారీ సంస్థ అట్లాస్ తాత్కాలికంగా లేఆఫ్ ప్రకటించింది....

ప్రపంచ సైకిల్ దినోత్సవం రోజే అట్లాస్ సైకిల్ ప్లాంటు లే ఆఫ్

ఘజియాబాద్(ఉత్తరప్రదేశ్): అంతర్జాతీయ సైకిల్ దినోత్సవం రోజే ప్రముఖ సైకిళ్ల తయారీ సంస్థ అట్లాస్ తాత్కాలికంగా లేఆఫ్ ప్రకటించింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని సహిబాబాద్ ప్రాంతంలో ఉన్న అట్లాస్ సైకిళ్ల తయారీ కర్మాగారంలో ఉద్యోగులకు తాత్కాలికంగా లేఆఫ్ ప్రకటిస్తూ కంపెనీ నోటీసు ఇచ్చింది. సహిబాబాద్ ప్లాంటులో నెలకు రెండు లక్షల సైకిళ్లు ఉత్పత్తి చేస్తుంటారు. వారం రోజుల క్రితం విధులకు రావాలని కోరిన అట్లాస్ సైకిళ్ల తయారీ సంస్థ ఉన్నట్టుండి లేఆఫ్ ప్రకటించి వేలాది కార్మికులను రోడ్డున పడేసిందని అట్లాస్ సైకిల్ ప్లాంట్ వర్కర్స్ యూనియన్ నాయకుడు మహేష్ కుమార్ ఆరోపించారు. గతంలోనూ అట్లాస్ యాజమాన్యం ఇతర ప్రాంతంలోని ఫ్యాక్టరీని మూసివేసి కార్మికులను రోడ్డున పడేసిందని కార్మిక నేతలు ఆరోపించారు. అట్లాస్ సైకిల్ ప్లాంట్ మూసివేత నిర్ణయంపై కార్మికులు ఆందోళన వ్యక్తం చేశారు. 

Updated Date - 2020-06-04T12:40:49+05:30 IST