ఆఫీస్ స్పేస్‌లో హైదరాబాద్ ఇలా...

ABN , First Publish Date - 2020-10-28T23:51:46+05:30 IST

కరోనా నేపథ్యంలో మార్చి నుండి ఆఫీస్ స్పేస్‌కు డిమాండ్ పడిపోయిన విషయం తెలిసిందే. అయితే అన్‌లాక్ తర్వాత పరిస్థితి మళ్ళీ కోలుకుంటూండడంతో ఆఫీస్ స్పేస్‌కు మళ్ళీ డిమాండ్ పెరుగుతోంది

ఆఫీస్ స్పేస్‌లో హైదరాబాద్ ఇలా...

హైదరాబాద్ : కరోనా నేపథ్యంలో మార్చి నుండి ఆఫీస్ స్పేస్‌కు డిమాండ్ పడిపోయిన విషయం తెలిసిందే. అయితే అన్‌లాక్ తర్వాత పరిస్థితి మళ్ళీ కోలుకుంటూండడంతో ఆఫీస్ స్పేస్‌కు మళ్ళీ డిమాండ్ పెరుగుతోంది. మిగతా నగరాలతో పోలిస్తే హైదరాబాద్ రియాల్టీ, ఆఫీస్ స్పేస్ మెరుగ్గా ఉంది. ముంబై, ఢిల్లీ, చెన్నై నగరాలను హైదరాబాద్ మించిపోయింది. జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో హైదరాబాద్ నెట్ ఆఫీస్ స్పేస్ రికార్డ్‌స్థాయిలో 1.54 మిలియన్ చదరపుటడుగులు. అంతకుముందు త్రైమాసికంలో 1.18 మిలియన్ చదరపుటడుగులు. ఈ మేరకు జేఎల్ఎల్(జోన్స్ లాంగ్ లాసెల్) డేటా నినవేదిక వెల్లడించింది. కాగా... ఆఫీస్ స్పేస్ లీజులో బెంగళూరు(504 శాతం) తర్వాత హైదరాబాద్ రెండోస్థానంలో ఉంది. 

సైబరాబాద్, హైటెక్ సిటీ, బంజారాహిల్స్ ఖాళీ..!

ఆఫీస్ స్పేస్ లీజ్ పెరుగుతున్నప్పటికీ, వెకెన్సీలు కూడా పెరుగుతూ వచ్చాయి. రెండో త్రైమాసికంలో 9.2 శాతంగా ఉన్న వెకెన్సీ లెవల్స్ సెప్టెంబర్ క్వార్టర్ నాటికి 11.3 శాతానికి పెరిగాయి. బంజారాహిల్స్, సోమాజిగూడ, బేగంపేట బెల్ట్‌లో, హైటెక్ సిటీ ప్రాంతంలో, గచ్చిబౌలిలో వేకెన్సీలు పెరిగాయి. ఇక్కడి నుండి చిన్న వ్యాపారాలు, చిన్న ఐటీ కంపెనీలు తరలిపోయాయి. ఆఫీస్ స్పేస్ లీజుల్లో ఐటీ, ఐటీ సేవల కంపెనీల వాటా క్రమంగా తగ్గుతోంది. 


Updated Date - 2020-10-28T23:51:46+05:30 IST