ఎన్‌టీపీసీ రూ.2,275 కోట్ల బైబ్యాక్
ABN , First Publish Date - 2020-11-03T05:32:34+05:30 IST
ఎన్‌టీపీసీ..రూ.2,275.74 కోట్లతో 19.78 కోట్ల షేర్లను బైబ్యాక్ చేయనున్నట్లు ప్రకటించింది. రూ.10 ముఖ విలువ కలిగిన ఒక్కో షేరును రూ.115 ధర వద్ద బైబ్యాక్ చేసేందుకు బోర్డు ఆమోదం లభించిందని తెలిపింది...
న్యూఢిల్లీ: ఎన్‌టీపీసీ..రూ.2,275.74 కోట్లతో 19.78 కోట్ల షేర్లను బైబ్యాక్ చేయనున్నట్లు ప్రకటించింది. రూ.10 ముఖ విలువ కలిగిన ఒక్కో షేరును రూ.115 ధర వద్ద బైబ్యాక్ చేసేందుకు బోర్డు ఆమోదం లభించిందని తెలిపింది. బైబ్యాక్‌కు ఈ నెల 13వ తేదీని రికార్డు తేదీగా ఖరారు చేసినట్లు పేర్కొంది. కాగా సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ రూ.28,677.64 కోట్ల ఆదాయం పై రూ.3,495 కోట్ల నికర లాభాన్నిఆర్జించింది.