బ్యాంకింగ్ కష్టాలు ఇప్పట్లో తీరవు
ABN , First Publish Date - 2020-10-07T06:59:03+05:30 IST
దేశీయ బ్యాంకింగ్ రంగం కష్టాలు ఇప్పట్లో తీరే సూచనలు కనిపించడం లేదు. కొవిడ్ నేపథ్యంలో స్వల్ప కాలంలో వీటి నిర్వహణ మరింత కష్టంగా మారిందని అంతర్జాతీయ పరపతి రేటింగ్ సంస్థ ‘ఫిచ్ రేటింగ్స్’ ఒక నివేదికలో పేర్కొంది...

- పెరగనున్న ఎన్‌పీఏలు, రద్దుల పద్దు: ఫిచ్
న్యూఢిల్లీ: దేశీయ బ్యాంకింగ్ రంగం కష్టాలు ఇప్పట్లో తీరే సూచనలు కనిపించడం లేదు. కొవిడ్ నేపథ్యంలో స్వల్ప కాలంలో వీటి నిర్వహణ మరింత కష్టంగా మారిందని అంతర్జాతీయ పరపతి రేటింగ్ సంస్థ ‘ఫిచ్ రేటింగ్స్’ ఒక నివేదికలో పేర్కొంది. రుణ పునర్ వ్యవస్థీకరణ అనుకున్న ఫలితాలు ఇవ్వకపోతే మొండి బకాయి (ఎన్‌పీఏ)లు, ఒత్తిడిలో ఉన్న ఆస్తులు, బకాయిల రద్దు భారం మరింత పెరిగే ప్రమాదం ఉందని అంచనా వేసింది. భారత బ్యాంకింగ్ రంగం ఇప్పటికే ఎన్‌పీఏలు, రుణాల రద్దు భారంతో కుంగిపోతున్న విషయాన్ని గుర్తు చేసింది. దేశీయ బ్యాంకులు 2014-19 మధ్య కాలంలోనే 8,500 కోట్ల డాలర్ల రుణాలను రద్దు చేసినట్టు తెలిపింది.
తీరని కష్టాలు: కొవిడ్ కేసులు రోజురోజుకి పెరగడంపైనా ఫిచ్ రేటింగ్స్ ఆందోళన వ్యక్తం చేసింది. బ్యాంకింగ్ రంగంలో సాధారణ పరిస్థితులు ఏర్పడేందుకు ఇది పెద్ద అడ్డంకిగా మారిందని తెలిపింది. ప్రభుత్వ ఆర్థిక పరిస్థితే అంతంత మాత్రంగా ఉన్నందున, ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వం బ్యాంకుల్ని ఆర్థికంగా ఆదుకునే అవకాశం లేదని పేర్కొంది.