రిక్రూట్‌మెంట్ సంస్థలకు జై
ABN , First Publish Date - 2020-03-02T07:21:39+05:30 IST
తమ కంపెనీలో పని చేసేందుకు అవసరమైన నైపుణ్యం ఉన్న వారిని కంపెనీలు నేరుగా నియమించుకుంటాయి. ఇందుకు సోషల్ మీడియా, జాబ్ సైట్ల సహకారాన్ని...

ముంబై: తమ కంపెనీలో పని చేసేందుకు అవసరమైన నైపుణ్యం ఉన్న వారిని కంపెనీలు నేరుగా నియమించుకుంటాయి. ఇందుకు సోషల్ మీడియా, జాబ్ సైట్ల సహకారాన్ని తీసుకుంటాయి. అయితే ఇప్పుడు కంపెనీలు తమకు అవసరమైన ఉద్యోగుల నియామకాల కోసం రిక్రూట్‌మెంట్ సంస్థలను ఆశ్రయించడం పెరుగుతోంది. దీని వల్ల జూనియర్, సీనియర్, మధ్య స్థాయిలో నైపుణ్యం కలిగిన వారిని పొందే అవకాశం ఏర్పడుతోంది.
ఈ విషయం సీఐఈఎల్ హెచ్‌ఆర్ సర్వీసెస్ నిర్వహించిన తాజా అధ్యయనంలో వెల్లడైంది. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్, జాబ్ సైట్లు ఉద్యోగుల నియామకాల్లో కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ ఎంప్లాయ్‌మెంట్ ఏజెన్సీల ద్వారా నియామకాలు చేపట్టేందుకు కంపెనీలు ప్రాధాన్యం ఇస్తున్నాయని ఈ అధ్యయనం స్పష్టం చేసింది. దీనివల్ల తమ పని తగ్గుతుందని, వ్యయాలు, సమయం ఆదా అవుతుందని కంపెనీలు భావిస్తున్నాయి. అంతేకాకుండా అభ్యర్థికి సంబంధించి వివిధ రకాల పరిశీలనలను నియామక సంస్థలే చూసుకుంటాయి కాబట్టి ఆ భారం తగ్గుతుందని కంపెనీలు చెబుతున్నాయి.