భారత్‌లో కాదు.. అమెరికాలో మాత్రమే : మనీ ట్రాన్సుఫర్ అదనపు ఛార్జీలపై గూగుల్ పే
ABN , First Publish Date - 2020-11-26T21:24:12+05:30 IST
కస్టమర్లకు గూగుల్ పే షాకివ్వనుందా ? జనవరి నుండి గూగుల్ పే వెబ్ యాప్స్ సేవలు నిలిచిపోనున్నాయా ? అంతేకాదు... గూగుల్ పే నుండి తక్షణ నగదు బదలీ కోసం ఛార్జీలను వసూలు చేయనుందా ?

న్యూఢిల్లీ : కస్టమర్లకు గూగుల్ పే షాకివ్వనుందా ? జనవరి నుండి గూగుల్ పే వెబ్ యాప్స్ సేవలు నిలిచిపోనున్నాయా ? అంతేకాదు... గూగుల్ పే నుండి తక్షణ నగదు బదలీ కోసం ఛార్జీలను వసూలు చేయనుందా ? ఈ ప్రశ్నల నేపధ్యంలో వార్తలొస్తోన్న విషయం తెలిసిందే. గూగుల్ పే వినియోగదారులు డబ్బులు పంపించేందుకు గూగుల్ పే యాప్ లేదా గూగుల్ పే వెబ్‌ను ఉపయోగిస్తున్నారు.
అయితే... వచ్చే ఏడాది నుండి డబ్బు పంపించేందుకు, స్వీకరించేందుకు పే డాట్ గూగుల్ డాట్ కాంను ఉపయోగించలేరని, ఇకపై గూగుల్ పే యాప్‌ను ఉపయోగించాలని కంపెనీ వెల్లడించింది. ఇది భారత్‌లోనూ వర్తిస్తుందని పేర్కొంటూ వార్తలొచ్చాయి. ఈ నేపధ్యంలో గూగుల్ పే స్పందించింది.
అమెరికా యూజర్లకు మాత్రమే...
గూగుల్ పే ప్లాట్‌ఫాం నుండి మనీ ట్రాన్సుఫర్‌కు అదనపు రుసుం చెల్లింపులపై వస్తోన్న వార్తల మీద స్పష్టతనిస్తూ... ఇది కేవలం అమెరికన్ యూజర్లకు మాత్రమేనని, భారత్‌లో కస్టమర్లు ఎలాంటి రుసుమూ చెల్లించాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పింది. సరికొత్త ఫీచర్లతో గూగుల్ పే యాప్‌ను విడుదల చేస్తున్నట్లు గూగుల్ ఇటీవల వెల్లడించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం దీనిని అమెరికాలో ప్రయోగాత్మకంగా అందుబాటులోక తీసుకు వచ్చింది. ఈ నేపథ్యంలో గూగుల్ పే యాప్ నుండి చేసే మనీ ట్రాన్సుఫర్‌కు అదనపు రుసుము చెల్లించాల్సి ఉంటుంది.
అమెరికాలో వెబ్ గూగుల్ పే ఉండదు...
భారత్‌లోని గూగుల్ పే, గూగుల్ పే బిజినెస్ కస్టమర్లు ఈ ఛార్జీ చెల్లించాల్సిన అవసరం లేదని గూగుల్ పే తెలిపింది. కేవలం అమెరికాలో మాత్రమే ఇది వర్తిస్తుందని పేర్కొంది. కొత్త ఏఢాది నుండి అమెరికాలో వెబ్ ఆధారిత గూగుల్ పే ఉండదని, కేవలం యాప్‌లో మాత్రమే చెల్లింపులు చేయాలని తెలిపింది. కొత్త ఫీచర్లతో కూడుకున్నగూగుల్ యాప్... ఆండ్రాయిడ్, ఐవోఎస్ ఫోన్లలో అందుబాటులో ఉంటుంది. వెబ్ బ్రౌజర్ అమెరికాలో మాత్రమే వినియోగించలేరు.